జగన్ - రోజా మద్య జరిగిన చర్చలేంటి? రోజాను ప్రక్కన ఎందుకు పెట్టారో స్పష్టత వచ్చినట్లే

ఆర్ కే  రోజా మంచి నటనా పటిమ ఉన్న టాలీవుడ్ కథానాయకి, నటి, రాజకీయవేత్త.  ప్రస్తుతం వైసీపీలో రెండోసారి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి శాసన సభ్యురాలుగా ఎన్నికైనారు. నిజంగా చెప్పాలంటే శాసనసభలో టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునే చెడుగుడాడించిన ఆధునిక వీరవనిత అనిచెప్పొచ్చు. 


ప్రస్తుతం ఆర్ కే రోజా వైసిపీలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత గా ప్రత్యర్థులపై ప్రతి సబ్జెక్ట్ లో నిశిత పరిశీలనచేసి అంటే నేపధ్యం చూసి విరుచుకుపడటంలో రోజాకి మించిన వారులేరు అని చాలా మంది వైసీపీలో ఉన్న నాయకులే అంటుంటారు. 

ముఖ్యంగా ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి - ఆర్ కే రోజాతో చాలా సన్నిహితంగా ఉంటారని, ఈ క్రమంలో కొత్త క్యాబినెట్ లో రోజాకి  సరైన సముచితమైన బెర్త్ ఖాయం అని అంతా అనుకున్నారు.  కానీ చివరికి ఆమెకు ఏ పదవి లభించక పోవటంతో కారణం ఏమై ఉంటుంది అని అటు నాయకులు, అనుయాయులు, అభిమానులు, ఉత్సుకత ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచనలో పడ్డారు. 


ఇంతకీ జగన్ రోజాకు ప్రాధాన్యం కల్పించక పోవడం వెనుక కారణం కూడా ఉందట. ముందుగా ఆమెను ముఖ్యమంత్రి పిలిచి ఒక ఆఫర్ ఇచ్చారని, అయితే ఆ ఆఫర్ ఆమె కు నచ్చకపోవడంతో మరో దారి లేక ప్రస్తుతానికి ఆమెను పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. 

గతంలో ఈ ఫైర్ బ్రాండ్ రోజాను చంద్రబాబు ప్రభుత్వంలో సభాపతి కోడెల శివప్రసాద్ చంద్రబాబు లోపూచీ సలహాలతో  ఏకపక్షంగా సూధీర్ఘంగా చాలా అమానవీయంగా ఏడాదిపాటుసభ నుండి బహిష్కరణకు గురిచేశారు. సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. 



అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండబోతున్న సభలో టిట్ ఫర్ టాట్గా  చంద్రబాబే.  రోజాను అధ్యక్షా! అని పిలిచే పరిస్థితిని కల్పించి తనకు ఒక రకమైన వృత్తిగత సంతృప్తి కలిగించాలన్న ఆలోచనే అదట. అందుకే రోజాకు స్పీకర్ పదవి ఇస్తున్నారనే చర్చ నడిచింది. ఇందులో జగన్ కు కూడా తన పార్టీ మహిళా నాయకురాలికి జరిగిన అవమానానికి సమాధానం ఆమె తోనే చెప్పించే స్పీకర్ పదవి ఇవ్వాలని భావించి రోజాను పిలిపించి ఆ విషయం చెప్పారట. 



అయితే రోజా మాత్రం తాను స్పీకర్‌గా ఉంటూ రాజకీయంగా అచేతనంగా ఉండలేనంటూ  తాను ఎక్కువగా ప్రజల్లోనే ఉండాల ని భావిస్తున్నానని చెప్పి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరారట. దీంతో జగన్ భవిష్యత్తులో కచ్చితంగా ఆర్కే రోజాకి తగిన సముచిత  స్థానం కల్పించాలనే ఆలోచనలోనే ఉన్నారని సమాచారం. జగన్  మాట తప్పరు – మడమ తిప్పరు అనేది మనందరికి తెలిసిన విషయమే కదా! నిరీక్షిద్ధాం! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: