చంద్రబాబును మాయలో పడేసి కమ్మేసి కుమ్మెసి కొంప ముంచిన కోటరీ పంచ పాండవులు

పార్లమెంటు సభ్యులకు జరిగిన పదవుల పంపకంపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అలిగారు. తనకు తక్కువ స్థాయి పదవి ఇచ్చారనే అలకగా మాత్రమే దాన్ని భావించడానికి లేదు. చంద్రబాబు వ్యవహారశైలిపై ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా చంద్రబాబు మారలేదని ఆయన అన్నారు. ఆయన చుట్టూ ఉన్నవాళ్లే ఆయనను తప్పు దోవ పట్టిస్తున్నారని కేశినేని నాని అన్నారు.


కేశినేని మాటలను ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. నిజానికి, చంద్రబాబు కోటరీయే ఎన్నికల్లో టీడీపి కొంప ముంచిందనే అభిప్రాయం కూడా ఉంది. ఎన్నికల సమయం లో వాస్తవాలు గ్రహించ డానికి వీలు కానంతగా చంద్రబాబును ఆ కోటరీ మభ్య పెట్టిందని తెలుగుదేశం పార్టీ వర్గాలే అంటున్నాయి.


కోటరీ పంచ పాండవులలోని వారంతా బాబు సామాజికవర్గానికే చెందిన వారే!  


*ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ: చంద్రబాబుకు సలహాలు ఇవ్వడంలో, పార్టీ వ్యూహరచన లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ విషయం రహస్యమేమీ కాదు. అయితే, క్షేత్ర స్థాయి పరిస్థితిని సరిగా అంచనా వేయడం లో రాధాకృష్ణ విఫలమయ్యారని అంటారు.


*ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్: ఎన్నికల సమయంలో నారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగినవారిలో ఆంధ్రా ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరో ప్రముఖుడు. సర్వేలు చేయడంలో దిట్టగా పేరు పొందిన ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో సరైన సర్వే ఫలితాలను చంద్రబాబుకు అందించారా? లేదా? అనేది అనుమానమని చెబుతారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఓట్ల లెక్కింపు రోజు కూడా ఆయన చెప్పారు. బయటకు చెప్పేది ఏమైనా, చంద్రబాబు కైనా అసలు విషయం చెప్పే స్థాయిలో సర్వేలు చేయించారా? లేదా? అనేది తెలియదు. ఈయన దెబ్బకు బెట్టింగ్ లో పాల్గొన్న అమాయకులెందరో నిండా మునిగారని సం ఆచారం.


*ఇంటిలిజెన్స్-చీఫ్ ఎబి వెంకటేశ్వరరావు: ఎన్నికల సమయంలో ఇంటిలిజెన్స్-చీఫ్ గా ఉన్న ఎబి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు కు సైకిల్ దే జోరు అని సమాచారమిచ్చి నమ్మించారని అంటారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ఆయనను ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇంటలిజెన్స్ సర్వేల పేర ఆయన చంద్రబాబును టీడీపి దే పక్కా విజయమని నమ్మించారని తెదేపా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.


*ఉద్యోగ సంఘం నాయకుడు పరుచూరి అశోక్ బాబు: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిన ఉద్యోగ సంఘం నాయకుడు పరుచూరు అశోక్ బాబును కూడా చంద్రబాబు ఎక్కువగా నమ్మారని అంటారు. ఉద్యోగులంతా మనవైపే ఉన్నారంటూ ఆయన చంద్రబాబును నమ్మించారని సమాచారం. ఉద్యోగులందరినీ టీడీపి అనుకూలంగా మలిచారనే ఉద్దేశంతోనే ఆశోక్ బాబుకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని అంటారు.


*చంద్రబాబు నివాసం యజమాని లింగమనేని రమేష్: చంద్రబాబు కోటరీలో మరో ప్రముఖుడు లింగమనేని రమేష్ అంటారు. చంద్రబాబు నివాసం ఉంటోన్న ప్రాంగణం ఆయనకు చెందిందే. పవన్ కల్యాణ్ కు, చంద్రబాబుకు మధ్యవర్తిగా ఆయనే వ్యవహరించారని అంటారు. లింగమనేని రమేష్ సలహా తోనే పవన్ కల్యాణ్ తన పార్టీని ఒంటరిగా బరిలోకి దింపారని అంటున్నారు. జనసేన ఒంటరి పోటీ - వైసీపి కొంప ముంచు తుందని భావిస్తే, అదే రివర్స్ లో టిడిపిని నిలువునా ముంచేసింది - అనేది ఒక అంచనా.

చంద్రబాబు నాయుడి తనయుడు మంత్రి నారా లోకేష్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా, రెండవ అధికార కేంద్రంగా  మారారు. నారా లోకేష్ ను చంద్రబాబు పూర్తి స్థాయిలో వెనకేసుకుని రావడంకూడా కొంప ముంచిందని అంటున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తానని అనడం, దానికి చంద్రబాబు అంగీకరించడం  తప్పుడు నిర్ణయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: