నితిన్ హీరోగా చేసిన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు మంచి
హిట్ కొట్టాయి. తరువాత కొన్ని సినిమాలు షరా మాములే. ఆ తరువాత సమంతతో
చేసిన అ ఆ సినిమా హిట్ అయ్యింది. నితిన్ హీరో అయినా.. సమంత నటనతో
ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్టైంది.
ఆ
సినిమా హిట్ కేవలం సమంత కే చెందినా అందులో హీరోగా నటించిన నితిన్ ని కూడా
పొగిడేశారు. అలా నితిన్ సమంత తో కలిసి నటించినందుకు అ… ఆ లాంటి బ్లాక్
బస్టర్ అందుకున్నాడు.
తన క్రేజ్ తో సూపర్
బ్లాక్ బస్టర్ ఇచ్చిన సమంత ఇప్పుడు మరో యంగ్ హీరోకి హెల్ప్ అవుతుందా?పెళ్లి
తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న సమంత తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ
సినిమాలో నటిస్తుంది. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాలో నాగ శౌర్య హీరో.
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో మరో సీనియర్ నటి లక్ష్మి కూడా
కీలక పాత్ర పోషిచింది.
చాలా కాలం నుంచి హీరో
నాగశౌర్య హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో
ఉన్న ఈ యూత్ హీరోకు ఈ సినిమా సెట్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే జులై 12
వరకు ఆగాల్సిందే.