రవిప్రకాష్ ను వదిలే ప్రసక్తే లేదు ...!

Prathap Kaluva

రవి ప్రకాష్ ఇప్పటి వరకు చేసిన చీకటి తప్పులు ఒక్కొక్కటిగా బయట పడటంతో పోలీసుల ముందు అడ్డంగా దొరికిపోయారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో టీవీ9 పాత.. కొత్త యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తమను వేధించింది కాక.. ఇప్పుడు కొత్త బురద చల్లటం ఏమిటంటూ వారు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. 


ఇప్పటివరకూ సర్లేనని ఉపేక్షిస్తే.. మరీ ఇంతలా హద్దులు దాటేస్తారా?  సంస్థను పూర్తిగా దెబ్బ తీయటమే కాదు.. మూలాల మీదే మరక పడేలా మాట్లాడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతైనా ఒకప్పుడు కలిసి ఉన్నామన్న భావనతో ఉన్న తమను ఇంతలా అవమానించిన రవిప్రకాశ్ ను అస్సలు వదిలిపెట్టకూడదని.. అతగాడి విషయంలో అన్ని అంశాల్లోనూ దృష్టి సారించాలన్న భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.


బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించే వరకూ రవి ప్రకాశ్ విషయంలో అంతో ఇంతో ఉన్న సానుకూలత మొత్తం.. ఆయన చేసిన తాజా ఆరోపణలతో పూర్తిగా పోయినట్లుగా సమాచారం. కోర్టు ముందు తమను చిత్రీకరించిన తీరుపై కొత్త.. పాత యాజమాన్యాలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి.సమాజంలో తమకున్న పేరు ప్రతిష్ఠల్ని దెబ్బ తినేలా ఆరోపణలు చేయటానికి తెగించిన రవి ప్రకాశ్ విషయంలో లెక్కలు తేలాల్సిందేనని.. అతగాడు తమకు చేసిన అన్యాయాలకు సంబంధించిన చిట్టాను తెర మీదకు తేవాలన్న భావనకు వచ్చినట్లుగా సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: