ఎయిర్‌ పోర్ట్‌లో, శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?

Shyam Mohan
పౌర విమానయాన శాఖ పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌ల్లో ముందస్తు సెక్యూరిటీ చెక్‌ నుండి, మినహాయించబడిన వారు ఎవరనగా..?
 ప్రధాని,రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,
మాజీరాష్ట్రపతులు, గవర్నర్లు,సుప్రీం ఛీప్‌జస్టిస్‌,లోక్‌సభ స్పీకర్‌,
కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు,
లోక్‌సభ,రాజ్యసభ ప్రతిపక్షనేతలు, భారత రత్న గ్రహీతలు,సుప్రీం న్యాయమూర్తులు....
ఇంకా మరికొంత మంది వివరాల లిస్టు ఇక్కడ చూడవచ్చు. 

. మరి, కేంద్ర ప్రభుత్వ రూల్స్‌ ఈ విధంగా ఉంటే,
చంద్రబాబు నాయుడు గారిని గన్నవరం ఎయర్‌ పోర్టు సెక్యూరిటీ వారు చెక్‌ చేశారని ,ఆయన వాహనాన్ని లోపలి వరకు రానీయ లేదని, ఛానెల్స్‌,పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో డిబేట్స్‌ నడుస్తున్నాయి. బాబుని అవమానించారంటూ, టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. 
సెక్యూరిటీ చెక్‌ కోసం క్యూలో నిల్చోవడం అవమానం కాదు, చిన్నతనం కాదు. భారత చట్టాలను గౌరవించడం అని నాయకులు గుర్తించాలి. 
ఇపుడున్న పౌర విమానయాన శాఖ రూల్స్‌ ప్రకారం ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి కి సెక్యూరిటీ చెక్‌ అవసరం ఉండదు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెక్యూరిటీ చెక్‌ ఉంటుంది. ప్రతిపక్షనాయుకుడిగా గతంలో జగన్‌ కూడా ఎయిర్‌ పోర్టులో క్యూలో నిలబడ్డారు. ఇపుడు చంద్రబాబు నాయుడి గారి వంతు అంతే!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: