ఎడిటోరియల్: బాబోరు ఇక 'అబ్సలీట్ పాలిటీషియన్' మాత్రమే - టిడిపిని కుమ్మేస్తున్న వైసీపి - బీజేపి

తెలుగుదేశం పార్టీ దాని కార్యకర్తలే ప్రధానం - మన మాజీ ముఖ్యమంత్రి గారికి.  ప్రజలు కాదు - ఇదే ఆయన్ని చావుదెబ్బ కొట్టినా, ఆయన తీరులో, మాటలో, ప్రవర్తనలో మార్పురాదు అందుకే ఆయన ఈ సమాజానికి  "అబ్సలీట్ పాలిటీషియన్" గా మారిపోయారు. ప్రస్తుతం ఆయన తనకు ఓట్లేసిన నలభైశాతం ప్రజల కోసం పనిచేస్తానని ప్రసంగించారు. ఒకసారి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వారిని ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గుర్తిస్తారు, ఓట్లు వేయని వారు సైతం మనసు మార్చుకుంటారు కూడా! గుంటూరు లోని టిడిపి కార్యాలయంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


*నీతి వంతమైన పాలన ఇచ్చామని -

*మనపై నమ్మకంతోనే 33000 ఎకరాల భూమిని రైతులు ఇచ్చారని

*40 శాతం ఓట్లను వేసిన ప్రజల కోసం పని చేయాలని

*రాజకీయ పార్టీ మనుగడకు కార్యకర్తలు చాలా అవసరమని

*37 ఏళ్ళ పాటు పార్టీని - జెండాని మోసింది కార్యకర్తలేనని

*పార్టీ వలన నష్టపోయిన కార్యకర్తలు పార్టీతో ఉన్నారన్నారని

*పార్టీకి మూలస్తంభాలు పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని

*ఇప్పటి వరకూ ఆరుగురు పార్టీ కార్యకర్తలు చనిపోయారని

*ప్రతి పార్టీ కార్యకర్తని కాపాడుకుంటామని

 

పేర్కొంటూ ఇక నుండి తెలుగు దేశం పార్టీ కార్యాలయంలోనే ఉంటానని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని, పార్టీ కోసం కష్టపడి పనిచేసి, ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చటం తన బాధ్యత అని చంద్రబాబు తెలిపారు.


ఈ ప్రసంగం విన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు " ఆయన  తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ముఖ్యమంత్రి మాత్రమే" నని  అనుకోవటంలో తప్పులేదు. అలా కాకుండా ప్రజలందరి కోసం అంటే అన్నీ సామాజిక వర్గాల కోసం - అన్నీ మతాల వారి కోసం - అసలు ఏపిలో స్థిరపడ్డ భారతీయ ప్రజలందరి కోసం పని చేస్తానని ఏనాడు అనలేదు. రాష్ట్రంలో ప్రధానంగా బాబు సామాజికవర్గ ప్రజలు, తన బందుగణం, ఆతరవాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్ప వేరెవరూ మనుషులు కాదా! పాలన లోని మిగతా వారంతా పాలితులు కాదా! ఇది సరిగా అవగాహన చేసుకోని "స్వంతలాభం కొంత మానుకొని" సేవలందించి ఉంటే,  కనీసం అలా ప్రజలకు కనిపిస్తేనైనా బాబు నేడు చింతపడకుండా ఉండేవారు కాదు. ఇప్పటికైనా అంటే 23శాసనసభా స్థానాలు గెలిచుకొని రాజకీయ పాతాళానికి పడిపోయినా కూడా ఆయనకు ఙ్జానోదయం కాలేదు 


ఆయన కోరేది:

*తనకు తన రాజకీయాలకు "ప్రజావేదిక"ను ప్రసాదించమని ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

*లింగమనేని ఎస్టేట్ అదే తన నివాసం అక్రమ నిర్మాణమని తేలినా దానిపై మాత్రమే రాజకీయంగా శ్రద్ధ పెట్టారు.

*ఇక తన కార్యకర్తలపై దాడులు అంటున్నారే తప్ప ప్రజలపై దాడులు అనటం లేదు.


అందుకే గత ఐదేళ్ళలో స్వార్ధం తప్ప త్యాగం తెలియని ఈ రాజకీయ భేతాళునికి జనం మరోసారి అధికారం ఇవ్వబోరు అనేది తధ్యం. అందుకే ఏపిలో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీనికి మించి సామాజిక వర్గ మీడియా రాసేరాతలు టిడిపికి, ప్రత్యేకించి చంద్రబాబుకు అత్యంత అనర్ధదాయకంగా ప్రతిబంధకంగా మారిపోయాయి. ఆ మీడియా రాతలపై "సోషల్ మీడియా" కథనాలతో చెలరేగి పోవటం చూస్తూనే ఉన్నాం.


సక్రమంగా వ్యవహరించి ఉంటే ఈ శూన్యత నుంచి  జనసేన అధినేత ప్రయోజనం పోంది ఉండేవారు. ఇప్పుడు ఆయనకు ఆయన పార్టీకి ఎలాంటి రాజకీయ అవకాశం కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఇప్పుడు బిజేపి దాన్ని వినియోగించు కోబోతోంది. ప్రస్తుతానికి చంద్రబాబు రాజకీయ ప్రయత్నాలు వృధా ప్రయాస - అనవసర  ఆయాసం మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: