పాకిస్తాన్ వెన్నులో చలి పుట్టిస్తున్న భారత్ నిర్ణయం

భారత సరిహద్దుల సమ్రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం రక్షణరంగం బలోపేతంపై శ్రద్ధ వహించింది. దేశం సరిహద్ధులలో ఉండి మన పతనాన్ని ఆశించే దాయాదిదేశం పాకిస్తాన్ నుంచి సర్వదా ముప్పుపొంచి ఉన్న సందర్భంలో ప్రపంచం లోనే అతి పెద్ద ఫైటర్ జెట్ డీల్‌ ఒప్పందానికి భారత్ సన్నద్ధం అవుతోంది.


పాత యుద్ధ విమానాలను తొలగించి వాటి స్థానాన్ని అత్యాధునిక ఫైటర్-జెట్లతో భర్తీచేయాలనే ఉద్దేశంతో 15 బిలియన్ డాలర్ల విలువైన 114ఫైటర్-జెట్ల కొనుగోలుకు అంతర్జాతీయ బిడ్‌ లను ఆహ్వానించే పనిలో ముందుకు సాగుతుంది. ఈ ఒప్పందం కోసం బోయింగ్, లాక్-హీడ్ మార్టిన్ కార్పొరేషన్, స్వీడన్‌కు చెందిన సబ్-ఏబీ తదితర అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు పోటీ పడుతున్నాయి. వీటిలో 85శాతం ఉత్పత్తి మనదేశంలోనే జరిగే ప్రతిపాదనతో అవకాశాలను అన్వేషిస్తూ ప్రయత్నిస్తుంది.


పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో మన దేశానికి ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అత్యంత విలువైన ఆయుధ కొనగోలు ఒప్పందాలేమీ చేసుకోలేదు. బాలాకోట్ ఎయిర్‌-స్ట్రైక్స్ తర్వాత, పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం ఒకటి భారతీయ వాయుసేనకు చెందిన పాతతరం మిగ్-21ను కూల్చివేసి సంఘటనతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం ఎయిర్‌ఫోర్స్‌ను బలోపేతం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. 


ఫైటర్-జెట్లు మాత్రమే కాకుండా యుద్ధట్యాంకులు, శతఘ్నులను కొనుగోలు చేయాలని రక్షణశాఖ తీవ్రంగా ఆలోచిస్తుంది. భారత్‌ లోనే సబ్‌మెరైన్లను నిర్మించి అందించాలనేది "విదేశీ షిప్ బిల్డర్ల" పెట్టబోతున్న షరతు అని తెలుస్తుంది. 2.2 బిలియన్ డాలర్ల వ్యయంతో ఆరు యుద్ధనౌకలు, వెసెల్స్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని రక్షణశాఖ సోమవార మే ఏడు షిప్‌ యార్డులను కోరింది.


భారత వాయుసేన - నౌకాదళానికి 400 యుద్ధ విమానాలు అవసరం ఉన్నందున 11బిలయన్ డాలర్ల వ్యయంతో 126రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఫ్రాన్స్ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ తో ఒప్పందం చేసుకున్నప్పటికీ, దీన్ని రద్దు చేసిన నమో ప్రభుత్వం అదే "డస్సాల్ట్ ఏవియేషన్" నుంచి 36జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. భారత వాయుసేన నౌకాదళాలను ఏక కాలంలో అధునికరించ్గబూనటం ఒక సాహసోపేత చర్యగా భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: