సింగపూర్ - అమ్మఒడి: ఒక్క ముక్కలో బాబుకూ జగన్ కూ తేడా ఇదీ..!
గతంలో సింగపూర్ కు ఫ్లయిట్ విజయవాడ నుంచి నడపాలంటే విమాన సంస్థలు ముందుకురాలేదు. అమరావతి నుంచి సింగపూర్ కు ఫ్లయిట్ నడిపితే మాకు నష్టం వస్తుందని ఆ సంస్థలు చెప్పాయి. ఆ సమయంలో ఏపీ సర్కారు ఆ నష్టం తాము భరిస్తామని చెప్పింది.
అందు కోసం కోట్ల రూపాయలు వెచ్చించింది. కానీ ఇప్పటి సర్కారుకు సింగపూర్ ఫ్లయిట్ ప్రాధాన్యత అంశం కానే కాదు.. అమ్మ ఒడి వంటి పథకాల కోసం ఖర్చు చేయడమే ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఆసక్తికలిగంచే అంశం. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగంలో కుండబద్దలు కొట్టారు.
సింగపూర్ కు విమానాలు నడపడానికి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టాలా?లేక పేద పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి కోసం డబ్బు ఇవ్వాలా అన్నది ప్రభుత్వం ఆలోచించి మొదటిది వదలివేసి,అమ్మ ఒడికే ప్రాదాన్యం ఇచ్చామని బుగ్గన తెలిపారు. నవరత్నాల ప్రాతిపదికన బడ్జెట్ ను పెడుతున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబుకూ జగన్ కూ తేడా ఇదే..!