జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా !
మొత్తానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని బాబుగోరి గుండెల్లో బాంబు పేల్చేదాకా వదిలేలా లేడు. గతంలో కొన్ని సందర్భాల్లో మన బాబుగోరు అండ్ ఆయన అనుచరగణం కేశినేనిని కొంతవరకూ అవమానించిన మాట వాస్తవం. అది దృష్టిలో పెట్టుకునే నాని ఇప్పుడు బాబుగోర్ని ఓ రేంజ్ లో ఆడుకోవడం మొదలుపెట్టారట. నిజానికి కేశినేని నానికి ఈ దఫా టికెట్ ఇవ్వకూడదని మన బాబుగోరు గట్టిగా ఫిక్సయ్యారట. అయితే గెలిచే నానిని తప్పించలేక చివరికి టికెట్ కేటాయించారు. టికెట్ ఇచ్చినా దారుణంగా తనని అవమానించారని.. ఇప్పడు బాబుగోరు పై కేశినేని నాని ఎక్కుపెట్టారు.
అందులో భాగంగా మొదట టీడీపీ నేతల పై సోషల్ మీడియాలో వరుస పంచ్ లు వేశారు.. వేస్తూనే ఉన్నారు. నిన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్ట్ మరింత సంచలనంగా మారుతోంది. 'రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్లో కొబ్బరి చిప్పల దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవీదార్లకి అవసరం. నాకు ఆ అవసరం లేదు. చంద్రబాబుగారు నా లాంటి వాళ్లు మీకు అవసరం లేదనుకుంటే పార్లమెంట్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తాను. లేదూ నాలాంటి వాళ్లే కావాలంటే మీ పెట్ డాగ్ ని కంట్రోల్ చేయండి ప్లీజ్' అంటూ కేశినేని నాని చేసిన ట్వీట్ ప్రస్తుతం బాబుగోరికి నిద్ర కూడా పోనివ్వట్లేదట. అసలుకే అసెంబ్లీలో జగన్ వెటకారానికి కుమిలిపోతున్న బాబును.. నాని మరింతగా కుమిలిపోయేలా చేస్తున్నాడు. ఏమైనా బాబును ఏడిపించడంలో జగనే అనుకుంటే.. నాని జగన్ నే మించిపోయాడుగా .. పాపం బాబుగోరు.