ఛైర్మన్ నిర్ణయంపై వ్యతిరేకత
తిరుమల తిరుపతి దేవస్ధానం
ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తాజా నిర్ణయంపై అన్నీ వర్గాల నుండి వ్యతిరేకత
పెరుగుతోంది. తాడేపల్లిలో తనకు ఓ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఛైర్మన్
ఆదేశించటమే వివాదానికి కారణమైంది. నిజానికి తాడేపల్లిలో ఛైర్మన్ క్యాంపు కార్యాలయం
అవసరమే లేదు.
మామూలుగా అయితే ఛైర్మన్ కు తిరుమలలోను, తిరుపతి పరిపాలనా భవనంలోను రెండు చాంబర్లుంటాయి. ఎక్కడి నుండి ఛైర్మన్ విధులు నిర్వర్తిస్తారో తెలీదు కాబట్టి తిరుమల, తిరుపతిలో రెండు చోట్లా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అంతేకానీ ఎక్కడపడితే అక్కడంతా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే సాధ్యంకాదు.
తాజాగా తాడేపల్లిలో తనకు ఓ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని వైవి ఎందుకు కోరుకుంటున్నారో తెలీదు. ఇక్కడి నుండి ఆయన నిర్వహించే టిడిపి పాలన ఏ ముంటుంది ? ఇక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరే ? పై రెండు చోట్ల అంటే అధికారులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆదేశాల అమలుకు ఇబ్బంది ఉండదు.
తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఓ క్యాంపు కార్యాలయం ఉంటే బాగుంటుందని అనుకున్నట్లున్నారు ఛైర్మన్. వైవి కూడా తాడేపల్లిలోనే ఓ విల్లాలో ఉంటున్నారు. అందులోనే ఏ ఓ కార్యాలయం ఎలాగూ ఉంటుంది కదా ? అలాంటిది ప్రత్యేకంగా విడిగా ఓ క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేయమని ఆదేశించటంలో అర్ధమేంటి ?