పవన్ !.. జగన్‌ను ఆదర్శంగా తీసుకో ! : సినీ దిగ్గజం సలహా

Chakravarthi Kalyan

సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక తన భవిష్యత్ జీవితం రాజకీయాలకే అంకితం అని ప్రకటించారు. సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోనే ఉంటానన్నారు. కానీ పవన్ తన నిర్ణయం మార్చుకోవాలని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కోరారు.


సినిమాల్లో నటిస్తూనే రాజకీయాలు చేయొచ్చని సూచించారు. ఇటీవల అమెరికా పర్యటనలో.. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత 15నిమిషాలు బాధపడ్డాను అన్న పవన్ మాటలను పరుచూరి సున్నితంగా విమర్శించారు. ఆ పదిహేను నిమిషాలు కూడా మీరు బాధపడి ఉండకూడదన్నారు. సినిమాల్లో హీరోకు ఏ లక్ష్యం ఉంటుందో అదే లక్ష్యంతో రాజకీయ నాయకుడూ ఉండాలని హితవు పలికారు.


ఈ విషయంలో పవన్ జగన్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని పరోక్షంగా సూచించారు.. “ ఇటీవల జగన్‌గారినీ చూశాం. దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడుతూనే ఉన్నారు. తన తండ్రి భౌతికంగా లేనప్పుడు పదవి కావాలని అనుకున్న జగన్‌ను చూసి అందరూ అవహేళన చేశారు. ఎవరెన్ని చేసినా, ఈరోజు ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నారు.


" పవన్‌ కల్యాణ్‌గారికి ఒక విషయం మళ్లీ మళ్లీ చెబుతున్నా. మీరు ఐదేళ్లు మేకప్‌నకు దూరంగా ఉండొద్దు. ఎంజీఆర్‌ను పవన్‌కల్యాణ్‌ ఆదర్శంగా తీసుకోవాలి. ఎంజీ రామచంద్రన్‌ పార్టీలోనే ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ, తను సీఎం అయ్యే వరకూ మేకప్‌ వేసుకోవడం మానలేదు. పవన్‌కల్యాణ్‌కు ఇదే నా విన్నపం.. నువ్వు ఒక అద్భుతమైన కథాంశాలతో రాజకీయ, సోషల్‌, రైతు సబ్జెక్ట్‌లతో సినిమాలు చేయాల అని అని పరుచూరి గోపాలకృష్ణ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: