జగన్.. బీ అలర్డ్.. లేకుంటే కొంప కొల్లేరే..?

Chakravarthi Kalyan

ముత్యాల ముగ్గు సినిమాలో ఓ తమాషా సన్నివేశం ఉంటుంది. ఆ సినిమాలో రావుగోపాలరావు పక్కన ఓ భజంత్రీ బ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది. ఎవరైనా ఆయన్ను పొగడగానే వాళ్లు బ్యాండ్ వాయిస్తారు. భజనపరుల మాయలో పడకుండాఈ ఏర్పాటు అన్నమాట.


ఇప్పుడు జగన్ కూడా అలాంటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీలు, నిరుద్యోగులకు మేలు చేసే ఐదు బిల్లులను వైసీపీ సర్కారు ఆమోదించింది. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ ను ఆకాశానికెత్తేస్తున్నారు.


జగన్ ను ఏకంగా అంబేద్కర్, పూలే, ఏసుప్రభులతో పోలుస్తూ కీర్తిస్తున్నారు.కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరి జయరాం మరో అడుగు ముందుకేశారు. వైఎస్ జగన్ ఎస్సీలకు అంబేద్కర్‌, ముస్లింలకు అల్లా, క్రిస్టియన్లకు జీసస్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.


ఈ సమయంలో చంద్రబాబు ఉంటే బాగుండేదంటూ... చంద్రబాబు నక్క అయితే జగన్‌ నాగలోకం అంటున్నారు జయరాం. తాను వాల్మీకి బోయ కుటుంబానికి చెందిన వాడినని.. మాకు జగనన్న వాల్మీకి లాంటి వారని... అందరికీ బ్రహ్మ రాత రాశాడంటారు.. నాకు మాత్రం జగనన్న రాసిన రాతతోనే ఈ మంత్రి పదవి దక్కిందని చెప్పుకొచ్చారు జయరామ్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: