ఆ ఎమ్మెల్యే మనసు మార్చుకున్నాడా..! బాబు ఫుల్ హ్యాపీ..?
విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి చేరవచ్చని కొన్నాళ్లుగా మీడియాలో ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం అనుకూల మీడియాగా పేరున్న పత్రికల్లోనే ఈ మేరకు వార్తలు జోరుగా వచ్చాయి. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మల్లాది విష్ణు ఉన్నారు. అందువల్ల బోండా ఉమ వైసీపీలోకి వస్తే ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.
అయితే.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతారని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బుజ్జగించడానికి ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయట. అవి ఫలిస్తున్నాయట కూడా. సోమవారం నాడు చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడతానని బోండా ఉమ అంటున్నారు. పార్టీ మారుతున్నట్లు తాను ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తున్నారు.
తన గురించి మీడియానే
రకరకాల కథనాలు ప్రచారం
చేస్తోందని ఇప్పుడు నెపం
మీడియా మీద వేస్తున్నారు.
విదేశాల నుంచి తిరిగొచ్చిన
ఉమను టీడీపీ ఎమ్మెల్సీ,
పార్టీ అర్బన్
అధ్యక్షుడు బుద్ధా వెంకన్న
కలిసి చర్చలు జరిపారు.
పార్టీని వీడవద్దని
బుద్దా వెంకన్న సూచించారు.
బొండా ఉమ పార్టీ మారరని,
టీడీపీలోనే కొనసాగుతారని
ఆయన నమ్మకంగా చెబుతున్నారు.
అయితే బోండా ఉమ.. గతంలో వైసీపీ నేతలపై తీవ్రమైన ఆరోపణలే చేశారు. అసెంబ్లీలో ఏకంగా రౌడీ భాష ఉపయోగించారు. అలాంటి ఉమను వైసీపీలో చేర్చుకుంటారా అన్న విమర్శలు వచ్చే అవకాశం ఉన్నా.. రాజకీయాల్లో వాటిని అంతగా పట్టించుకునే ఛాన్స్ లేదు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాదు కనుక వైసీపీలో చేర్చుకోవడం అంత కష్టం కూడా కాదు. కానీ ఎందుకో పార్టీ మారే విషయంపై బోండా ఉమ పునరాలోచనలో ఉన్నట్టున్నారు. ఏదేమైనా ఈ పరిణామం చంద్రబాబుకు సంతోషదాయకమే. కొన్నాళ్లుగా పార్టీ నుంచి వలసలు తగ్గుతున్న సమయంలో ఈ వార్త ఆయనకు ఫుల్ జోష్ ఇస్తుంది.