ఆ ఒక్క పని చేస్తే చాలు.. బాబు ఇల్లు ఎప్పుడో మునిగేది..?

Chakravarthi Kalyan

కృష్ణా వరదల సంగతి.. వరద బాధితుల సంగతేమో కానీ.. కరకట్టపై చంద్రబాబు ఇల్లు మాత్రం హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. చంద్రబాబు ఇల్లు ముంచటానికి మంత్రులు కుట్రలు పన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రధానాంశంగా రోజూ ఆ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివరణ ఇచ్చారు.


ఈనెల 9 తేదీన శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామని.. ఎక్కడా వరద నీటిని ఆపేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని ముంచేసినట్టు కొందరు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తంచేశారు. నిజంగానే తాము చంద్రబాబు ఇంటిని ముంచాలనుకుంటే.. 8 లక్షలు కాదు పది నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీటిని పై నుంచి విడిచిపెట్టేవారమని మంత్రి వివరించారు. టీడీపీ  నేతలు లేనిపోని ఆరోపణలు మానుకోవాలని  అనిల్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. గరిష్టంగా 8.05 లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేశామని మంత్రి తెలిపారు.


ఎక్కడికక్కడ పొరుగురాష్ట్రాల తో … సమన్వయం చేసుకుంటూ దిగువకు నీటిని విడిచి పెట్టామన్నారు. వచ్చిన వరదకే కోన్ని లోతట్టు ప్రాంతాలు మునిగి నష్టం వాటిల్లిందని... ముందస్తుగా వస్తున్న ప్రవాహాలను అనుసరించే .. ఆల్మట్టి నుంచి కూడా నీరు విడుదల అయ్యిందని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.


రాయల సీమ కు నీటిని ఇవ్వటం లో ఎలాంటి నిర్లక్ష్యం చేయడం లేదని గుర్తించాలని  మంత్రి తెలిపారు. అధికారులతో  సమీక్షలు చేయడం ఒక్కటే  తమబాధ్యత కాదని..., క్షేత్రస్థాయిలో ప్రజల బాగోగులను పట్టించుకోవాలన్నారు. ప్రస్తుతం కృష్ణా నదిలోకి వరద ఉధృతి తగ్గిందని జలవనరులశాఖ మంత్రి అనిల్ స్పష్టంచేశారు. పులిచింతల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ లో దిగువకు నియంత్రించి  నీటిని వదులుతున్నామని తెలిపారు.


 వరద పై దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు వారి పని వారు చేశారని.. దీనిపై తాము ఎక్కడా జోక్యం  చేసుకోలేదని చెప్పారు... కాలువలకు దాని సామర్థ్యం మించి నీళ్లు ఇవ్వలేమని.. సముద్రంలో కి 270 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి విడిచిపెట్టామని  జలవనరుల శాఖ మంత్రి తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: