పాపం.. లోకేశ్ కు సొంత పార్టీ నుంచే షాక్..!

Chakravarthi Kalyan

ఔను.. మాజీ మంత్రి నారా లోకేశ్ కు ఇప్పడు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇందుకు కారణంగా మారుతోంది. ఇటీవల ఆయన సాహో సినిమాపై ట్వీట్టర్లో ఓ పోస్టు పెట్టారు. వాస్తవానికి ఓ వెబ్ సైట్ కు వ్యతిరేకంగా ఆయన పోస్టు పెట్టారు. అయితే అందులో ఆయన వాడిన పదజాలం సొంత పార్టీ వారికే కోపం తెప్పిస్తోందట.


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ సాహో సినిమా స్పందించిన తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ట్రోలింగ్ తో తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ఇంతకీ లోకేశ్ ఏమన్నారంటే.. సాహో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విజువల్ వండర్ సినిమా అని.. ఆ సినిమా చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, సాహో సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు.


ఇలా లోకేశ్ సాహో సినిమాపై పాజిటివ్ గా కామెంట్ చేయం తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నచ్చడం లేదట. ఇందుకూ కారణం లేకపోలేదు. కొంతకాలం కింద ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చంద్రబాబు నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చచ్చిన పాము అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత ఇటీవల హీరో ప్రభాస్ కూడా జగన్ ను పొగిడారు. జగన్ పొలిటికల్ బాహుబలి అన్నట్టు వార్తలు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో లోకేశ్ సాహో సినిమాపై పాజిటివ్ గా కామెంట్ చేయడం ఏంటన్నది టీడీపీ అభిమానుల లాజిక్.


అందుకే లోకేశ్ వైఖరి నచ్చని టీడీపీ హార్డ్ కోర్ అభిమానులు తమ కోపం నేరుగానే ప్రదర్శిస్తున్నారు. మన గురించి తప్పుగా మాట్లాడిన వారికి ఎలా సపోర్ట్ చేస్తారని లోకేష్ ను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి లోకేష్, బాలకృష్ణ రాజకియాలకు అనర్హులని కామెంట్లు పెడుతున్నారు. వారిద్దరూ పార్టీకి దూరంగా ఉంటే తెలుగుదేశానికి మంచిదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: