షాకింగ్ : బాబు బంధువుకు రూ. 5 కోట్లకే 500 ఎకరాలు ?

Chakravarthi Kalyan

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పక్కాగా జరిగిందా.. ముందుగానే టీడీపీ నాయకులు వందల ఎకరాల భూములు కొనిపెట్టుకున్న తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించారా.. అవునంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. కేవలం ఆరోపించడమే కాదు.. ఆ వివరాలు కూడా బయటపెడుతున్నారు. తాజాగా ఆయన చెప్పిన వివరాలు షాకింగ్ గా ఉన్నాయి.


ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు కు వియ్యంకుడు అయిన విబిసి రామారావుకు 493 ఎకరాల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారట.. రేటు ఎంతో తెలుసా.. ఎకరం కేవలం లక్ష రూపాయలు.. అంటే 493 ఎకరాలు.. కేవలం 5 కోట్లకే అన్నమాట.. అలా సొంత బంధువుకు కట్టబెట్టిన తర్వాతే దానిని రాజధాని కింద ప్రకటించారట. దీనికి చంద్రబాబు ఏమంటారని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ కాదా అని నిలదీశారు.


అవినీతి నిరూపించాలని అంటున్నారని, కొంచెం వెయిట్ చేయండని బొత్స అన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ తోడల్లుడి తండ్రికి భూమి ఇచ్చారని ఆయన అన్నారు. రాజదాని ఒక ప్రాంతానికో, ఒక సామాజికవర్గానికో, ఒక నాయకుడికో కాదని తాను చెబుతున్నానని, పదమూడు జిల్లాలకు చెందినవారిదని తమ ముఖ్యమంత్రి ఆలోచన అని చెబితే దానిని తప్పు పడుతున్నారని ఆయన అన్నారు.


ఇలా ప్రాంతాల మధ్య తారతమ్యం రాకూడదనేది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభిమతమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ఏ అంశం దొరుకుతుందా.. దాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందుదామా అని ప్రతిపక్షం చూస్తోందని బొత్స మండిపడ్డారు. కృష్ణా నదికి వరదలు వస్తే.. చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్టులతో ఏ విధంగా విషప్రచారం చేయించారో అందరికీ తెలుసని బొత్స అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: