సమాజం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే మనుష్యులు మరింత జల్సాలకు, విలాసాలకు అలవాటు పడుతున్నారు. డబ్బు సంపాదన కోసం కొందరు.. విలాసాల కోసం మరికొందరు పెడదోవ పడుతున్నారు. సలువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కొందరు మహిళలు వ్యభిచార వృత్తిలోకి దిగుతుంటే... వారి బలహీనతలు, కోరికలను ఆసరాగా చేసుకున్న మరికొందరు వారిని ఈ వృత్తిలోకి దింపుతున్నారు.
కర్నాటక రాజధాని బెంగళూరులో లైవ్ బ్యాండ్ లో పని చేస్తున్న అమ్మాయిలతో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న లైవ్ బ్యాండ్ యజమానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అంతమైన అమ్మాయిలను ఉపాధి పేరుతో అక్కడకు తీసుకు వెళుతున్నారు. అక్కడకు వెళ్లిన వారికి విలాస వంతమైన జీవితం అలవాటు చేస్తున్నారు. ఈ జల్సాలకు అలవాటు పడిన వారు చివరకు వాటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు క్రమంగా వీరిని వ్యభిచార వృత్తిలోకి దింపుతారు.
అక్కడ అందమైన అమ్మాయిలతో మించు (రెచ్చిపో) అనే పేరుతో లైవ్ బ్యాండ్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వీరిని వివిధ అలవాట్లకు గురిచేసి, జల్సాల్లో ముంచి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. ఇక్కడ వీరితో వ్యభిచారం చేయించేందుకు హైటెక్ వేశ్యవాటికలు ఏర్పాటు చేశారు. వీరికి కొందరు ఫైవ్‌స్టార్ హోటల్ మేనేజర్లు కూడా సహకరిస్తుండడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు... ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.
ఇంటర్నేషనల్ హోటల్స్‌తో రూంలు బుక్ చేసుకుని.. అమ్మాయిలను తీసుకువచ్చి విటులను ఆకర్షించి అక్కడికి పిలుచుకుని వచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలను బట్టి, విటుల రేంజ్‌ను బట్టి ఒక్కో నైట్‌కు వారి వద్ద నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. మొత్తానికి పోలీసులు దాడితో వీరి గుట్టు రట్టయ్యింది.