సమాజంలో రోజు రోజుకు విపరీత పోకడలు పెరిగిపోతున్నాయి. విశృంఖలమైన శృంగారం కోసం పరితపించి పోతోన్న వారు వావి వారసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఆడా, మగా తేడా లేకుండా పోతోంది. రొటీన్‌కు భిన్నంగా ఉన్న ఈ వివాహేతర సంబంధం స్టోరీ ఆసక్తిగా ఉంది. సెక్స్ కోసం మహిళల్ని టార్చర్ చేసే మగాళ్ల గురించి విన్నాం. దీనికి రివర్స్ లో ఉంటుంది తాజా ఉదంతం. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని ఓ ప్రాంతానికి గుజరాత్ నుంచి 17 ఏళ్ల కుర్రాడు వచ్చాడు.
అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటున్నాడు. అతడికి పక్క ఇంట్లో ఉన్న ఆంటీ పరిచయం అయ్యింది. కొత్త ప్రదేశం కావడంతో ఆ ఆంటీ ఆ కుర్రాడికి చాలా సాయం చేసేది. చనువు పెరగడంతో అతడు ఆంటీ.. ఆంటీ అంటూ ఆమెతో స్నేహంగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె తనలోని అసలు రూపం భయట పెట్టింది.
తన భర్త విదేశాల్లో ఉన్నాడని.. తాను లైంగీక సుఖాలకు దూరంగా ఉన్నానని తన కోరిక తీర్చాలని బ్లాక్మెయిల్ చేసింది. అందుకు ఆ కుర్రాడో నో చెప్పడంతో అతడిని లొంగదీసుకునేందుకు ఓ కొత్త ప్లాన్ వేసింది. తనను సుఖ పెట్టకుంటే తనను రేప్ చేశావని రచ్చ చేస్తానని.. పోలీసులకు కంప్లెంట్ చేస్తానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన ఆ కుర్రాడు ఆమెతో సెక్స్ చేశాడు. ఇలాంటివి ఏ మాత్రం ఇష్టం లేకపోవడంతో ఆ కుర్రాడు చాలా భయం భయంగానే ఆమెతో సెక్స్‌లో పాల్గొంటున్నాడు.
చివరకు ఆమె టార్చర్ భరించలేక అతడే స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి తన వేదనను మొరపెట్టుకున్నాడు. తన వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనని.. తనను బెదిరించి లొంగదీసుకున్న ఆంటీపై చర్యలు తీసుకోవాలని కోరారు. చివరకు పోలీసులు ముందుగా షాక్ అయినా కేసు నమోదు చేసుకుని ఆంటీని పిలిచి విచారిస్తున్నారు.