చిదంబరం తీహార్ జైలుకు ... బాబుకు కూడా అదే పరిస్థితి ?
అయితే చిదంబరం కోసం తీహార్ జైల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. చిదంబరం లాయర్ అభ్యర్ధన మేరకు చిదంబరంకు ప్రత్యేక సెల్ ను కేటాయించబోతున్నారు. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెం. 7 ను కేటాయించబోతున్నారు. గతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని .. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్ గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్ట్ ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు.
అలాగే జైల్లో చిదంబరంకు మంచం అది కూడా పరుపు లేకుండా ఉండేది మాత్రమే ఇస్తామని చెప్పుకొచ్చారు. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఇటువంటివి ఉంటాయి. మిగతా వారు అయితే కిందే పడుకోవాల్సిందేనని చెప్పారు. అయితే పరిస్థితి చూస్తుంటే చిదంబరంకు బెయిల్ వచ్చేది కష్టంగా మారింది. కేంద్రం కూడా చిదంబరం కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.