గంగానది శుద్ధి కోసం మోడీ త్యాగం..

venugopal Ramagiri
సామాన్యంగా ఎవరింట్లోనైన చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతేనే గిఫ్ట్‌లు బోలెడన్ని వస్తాయి.ఆ వచ్చిన గిఫ్ట్స్ వారు భద్రంగా అలమారాలో దాచుకుంటారు.కనీసం వారిదగ్గర ఎక్కువున్న బహుమతుల్లో నుండి ఒక్కటి కూడా పక్కవారికి ఇవ్వరు.సామాన్యులకే అన్నేసి బహుమతులు వస్తుంటే ఇక సెలబ్రెటీల సంగతి గురించి వేరే చెప్పక్కర్లేదు వారికిచ్చే గిఫ్ట్‌లో నాణ్యత ఎక్కువగా వుంటుంది.మరి మన ప్రధాని మోడిగారికి వచ్చిన మంచి,మంచి బహుమతులన్ని దాచుకోకుండా ప్రజా శ్రేయస్సుకొరకు వాటిని వేలం వేసి వచ్చిన డబ్బును గంగా నదిని శుభ్రపరచడం కోసం ఉపయోగించనున్నారు.



ఇక మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి వివిధ విదేశీ పర్యటనల పట్ల వున్న మక్కువతెలిసిందే ఈ సందర్భంగా అనేక దేశాలు పర్యటించిన సందర్భంలో విదేశీయులు,దేశ దేశాల్లో వున్న మన తెలుగువారు,ఆదేశ అధ్యక్షులు,ప్రధానమంత్రులు,ఇతర రాజకీయ ప్రముఖులు ఎన్నో బహుమతులు మోదికి ఇచ్చారు.ఈ వస్తువులను మిగతా వారిలా కాకుండా వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది.ఈ బహుమతులను సెప్టెంబర్‌ 14 నుంచి ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ వెల్లడించారు.ఈ బహుమతుల వేలం ద్వారా వచ్చేమొత్తాన్ని గంగానదిని శుభ్రపరచడంకోసం మోదీప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నమామి గంగే’ప్రాజక్ట్‌కు కేటాయించనున్నారు.గత ఆరునెలల కాలంలో మోదీకి వచ్చిన 2,722 బహుమతులను వేలంలో అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు.ఇక మోదికివచ్చిన వస్తువులను న్యూఢిల్లీలోని నేషన్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌లో ప్రదర్శన కోసం ఉంచారు.






ఈవస్తువుల ధరలు రూ. 200 నుంచి మొదలుకుని రూ. 2.50 లక్షల వరకు ఉండనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈసారి వేలం వేయనున్న బహుమతుల్లో భారతీయులు ఇచ్చినవే ఎక్కువగా ఉండటం విశేషం.ఇప్పటికే ఒకసారి అంటే జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో తొలిసారిగా మోదీకి వచ్చిన బహుమతులను సాంస్కృతిక శాఖ వేలం వేయగా వచ్చిన  నిధులను గంగానది శుద్ధి కోసం చేపట్టిన నమామి గంగ ప్రాజెక్టుకు కేటాయించింది.దీంతో ఇప్పుడు  రెండవసారి కూడా వేలం వేయాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు.ఈ సారి వేలంలో కూడా వివిధ బహమతుల ద్వారా భారీ మొత్తం రానుందని తెలుస్తోంది..ఇక మోడీ ఉదారతను పలువురు ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: