చంద్రబాబుకు నిసిగ్గుగా ఎల్లోమీడియా క్లీన్ సర్టిఫికేట్ ?

Vijaya

జనాలు ఛీ కొట్టి అధికారంలోకి దింపేసిన దగ్గర నుండి చంద్రబాబునాయుడుకు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వటంలో ఎల్లోమీడియా నానా అవస్తలు పడుతోంది.  తన రోత రాతలతో చంద్రబాబును ఎంతగా వెనకేసుకొస్తున్నా జనాలు నమ్మరని తెలుసుకోవటం లేదు. తన కొ(చె)త్తపలుకులో చంద్రబాబుకు  మిస్టర్ క్లీన్ అని సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు. రాజకీయాల్లో ఇంతటి క్లీన్ ఇమేజి ఉన్న నేత మరొకరు లేరని ఒకటే ఊదరగొట్టారు.

 

ఆయన రాసిన కాలమ్ లో  చాలా అబద్దాలే ఉన్నాయి. అందులోని అబద్ధాల్లో ఒకటేమిటంటే రాజకీ ప్రత్యర్ధులను వేధించటం అధికారంలో ఉన్న పార్టీలకు మామూలు అయిపోయిందట.  తెలంగాణాలో కెసియార్, ఏపిలో జగన్ ఇపుడు అదే పని చేస్తున్నారట. రాజకీయాల్లోకి ఏదో ఓ వ్యాపారమున్న వారే వస్తున్నారు కాబట్టి గెలిచిన తర్వాత ఒత్తిడి పెట్టి వేధించటం అధికార పార్టీ మామూలైపోయిందిట. గెలిచిన వాళ్ళని అధికార పార్టీలోకి కెసియార్ ఇలాగే లాక్కుంటున్నారని చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

ప్రతిపక్షాల తరపున గెలిచిన వారిని లాగేసుకోవటం జరుగుతున్నది నిజమే. అయితే ఆ పని చేసింది తెలంగాణాలో కెసియార్, ఏపిలో చంద్రబాబు నాయుడే.   తాను అధికారంలో ఉన్నపుడు వైసిపికి చెందిన 23 ఎంఎల్ఏలు, 3 ఎంపిలను ప్రలోభాలకు గురిచేసి, ఒత్తిళ్ళు పెట్టి టిడిపిలోకి లాక్కున విషయాన్ని చెత్తపలుకు ఉద్దేశ్యపూర్వకంగా మరుగున పరిచింది.  అంటే ఈ విషయాన్ని జనాలు మరచిపోయుంటారనే చెత్తపలుకు ఉద్దేశ్యం.

 

ఇక ప్రతిపక్ష సభ్యులను వేధించటం గురించి కూడా చంద్రబాబు చేసినదే. ప్రజా ప్రతినిధులను వేధింపులకు గురిచేయకపోతే వైసిపి నుండి ఎందుకు టిడిపిలో చేరుతారు ? అసెంబ్లీ నుండి రోజాను ఏడాది సస్పెండ్ చేయటాన్ని ఏమంటారు ? ఎంఎల్ఏలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు నేతలపై కేసులు పెట్టటం, జైళ్ళకు పంపటం చంద్రబాబు వేధించటం కాదా ?  

ఇపుడు కోడెల కుటుంబంపై కేసులున్నాయంటే అవేవీ కావాలని జగన్ ప్రభుత్వం పెట్టినవి కావని అందరికీ తెలుసు.  అడ్డదిడ్డంగా వ్యాపారాలు చేయటం, బెదిరించి భూములు లాక్కోవటం, భూముల కబ్జాల్లాంటి అరాచకాలకు పాల్పడ్డార కాబట్టే కొడుకు, కూతురుపై బాధితులు ఫిర్యాదులు చేస్తే కేసులు నమోదయ్యాయి. అందుకే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నది పెద్దలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: