అసలు సినిమా ఇప్పుడే మొదలైందా ?

Vijaya

మూడు నెలల పరిపాలననే చంద్రబాబునాయుడు, చినబాబు అండ్ కో తట్టుకోలేకున్నారు. అందుకే ప్రతి విషయంలోను  నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఆరోపణలు, విమర్శలతో చెలరేగిపోతున్నారు అబ్బా కొడుకులు. మూడు నెలల పాలనకే జగన్ ను తండ్రి, కొడుకులు తట్టుకోలేకపోతుంటే ఇక ఐదేళ్ళు ఎలా నెట్టుకొస్తారబ్బా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

 

 ఇలాంటి సమయంలోనే వైసిపి ఎంపి విజయసాయి మాట్లాడుతూ ఇపుడే మొదలైంది అసలైన సినిమా అంటూ ట్విట్టర్లో  ఓ ట్వీట్ పెట్టటంతో సర్వత్రా ఆసక్తి మొదలైంది.  నిజానికి జగన్ ఇంకా ప్రతిపక్షాల మీదకు తన దృష్టిని పెట్టలేదని చాలామంది అనుకుంటున్నారు. పాలనా పరమైన వ్యవహారాలతో బిజీగా ఉన్న జగన్ ప్రభుత్వం మీద పట్టు బిగించే పనిలో ఉన్నారు. అందుకనే రాజకీయ వ్యవహారాలపై పెద్దగా దృష్టి సారించలేదు.

 

పోలవరంలో దోచుకున్న సొమ్మును వెదజల్లి ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు అనుకున్నాడంటూ విజయసాయి ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు. అయితే ప్రజలు తుపుకుమని ఉమ్మటంతో నడుములిరిగేలా నేలపై పడ్డాడట చంద్రబాబు. డ్యాం పునాదుల నుండి అవినీతి సాక్ష్యాలు బయటకు ఉబికి  వస్తున్నాయి.  ఎవరి కాళ్ళు పట్టుకుని బయటపడాలా అని వెతుకుతున్నాడని ఎద్దేవా చేశాడు. అందుకనే అసలైన సినిమా ఇపుడే మొదలైంది. అంటూ ఎంపి చేసిన  ట్వీట్ తో  సర్వత్రా ఆసక్తి మొదలైంది.

 

ఇంతకీ విజయసాయి చెప్పిన అసలైన సినిమా ఏమిటో అర్ధం కావటం లేదు. ఎందుకంటే పాదయాత్రలోను, మ్యానిఫెస్టోలోను జగన్ చెప్పిన హామీలన్నింటిని అమలు చేయటానికి రంగం రెడీ చేసుకుంటున్నారు. ఇందులో సగం గ్రౌండ్ అయినా కానీ జగన్ రికార్డు సృష్టించినట్లే అనుకోవాలి.

 

తొందరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని జగన్ ఇప్పటికే మంత్రులు, నేతలకు స్పష్టంగా చెప్పారు. వాళ్ళు కూడా ఆ దిశగానే కసరత్తులు చేసుకుంటున్నారు.  ఈ నేపధ్యంలోనే విజయసాయి చెబుతున్న అసలైన సినిమా ఏమయ్యుంటుదబ్బా అంటూ ఎవరికి వాళ్ళు ఆలోచిస్తున్నారు.

                                                                                                   

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: