రోమ్ నగరం తగులబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటు కూర్చున్నట్లు ఉంది మన ప్రభుత్వ విధానం. ఎరువుల కొరతతో రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి ఊపిరాడక చనిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది. కనీసం ఎరువులను అందించలేని ప్రభుత్వం రైతుల అభివృద్ది కోసం కృషిచేస్తున్నమంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారో పాలకులకే తెలియాలి.
ఖరీఫ్ సీజన్ లో సాగుచేసిన వర్షాధార పంటలకు ముఖ్యంగా యూరియా అవసరపడుతుంది. కాగా విత్తనాలు వేసినప్పటి నుండి ఇప్పటి వరకు యూరియా రైతుకు సక్రమంగా మార్కెట్లో దొరకలేదు. బ్లాక్ లో కొనుగోలు చేయడం, గంటల తరబడి క్యూలో నిలబడి లారీల్లో యూరియా సంచులు అయిపోవడంతో చివరకు వెనుదిరిగినటువంటి రైతులు అనేక మంది రైతులున్నారు. ఇలా కొంత మంది రైతులు సమయానికి పంటలకు యూరియా లబించకపోవడంతో అందినప్పుడు పంటలకు యూరియా వేసి పంట దిగుబడి తగ్గే అవకాశమున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది రైతులున్నారు.
తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో యూరియా దొరక్క రైతులు ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు లాఠీదెబ్బల పాలవుతుండడం, కొంత మంది క్యూలో నిలబడి ఊపిరాడక చనిపోవడం జరుగుతుంటే పాలకులు ఇప్పటి వరకు ఈ విషయంలో ఎందుకు నోరు ఎందుకు మెదపడం లేదో అర్ధం కావడం లేదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి పరిస్థితిలో రైతులు యూరియా కోసం ఇలా చనిపోతుంటే నోరు మెదపని ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే ప్రజలు చూసే అవకాశముంది.
మరింత సమాచారం తెలుసుకోండి: