షాకింగ్ : ఆ టీడీపీ మంత్రి.. ఆ పత్రిక విలేఖరిని చంపించాడా..?

Chakravarthi Kalyan

విలేఖరులకూ పార్టీలకు ఉన్న సంబంధాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మీడియా కూడా పార్టీలవారీగా చీలిపోతున్న వేళ.. రాజకీయ పార్టీల ప్రేమకూ.. కక్షలకూ జర్నలిస్టులు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చిది. టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన ప్రత్తిపాటి పుల్లారావు ఆంధ్రప్రభకు చెందిన జర్నలిస్టును చంపించారట.


ఈ మాటల అంటున్నది వైసీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. చీరాలలో నాగార్జున రెడ్డి అనే వ్యక్తిపై దాడి జరిగితే దాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం ఉందని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో ఈ విమర్శలు చేశారు. తన ఫ్యాక్టరీలో పనిచేసిన వారు కుటుంబ తగదాలతో ఓ మహిళ చనిపోతే సిగ్గులేకుండా చంద్రబాబు పరామర్శకు వచ్చి సీఎంపై నిందలు వేస్తున్నాడని ఆమంచి అన్నారు. కోడెల శివప్రసాద్‌ చనిపోతే తెలంగాణ అంతా ఊరేగించాడు. ఏపీకి వస్తే నలుగురు కూడా లేరు. శవయాత్రలో రెండు వేళ్లతో విక్టరీ సింబల్‌ చూపించాడు. అంటే చంద్రబాబు వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని సంతోషంగా విక్టరీ చూపించాడా..?


సీఎం వైయస్‌ జగన్‌ శక్తి ముందు చంద్రబాబు చాలడు. బాబుపై నమ్మకం లేక వైయస్‌ఆర్‌ సీపీలో చేరేందుకు వేల సంఖ్యలో నాయకులు క్యూలో ఉన్నారు. 2017లో చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు వర్గీయులు ఆంధ్రప్రభ రిపోర్టర్‌ అనే వ్యక్తిని చంపితే ఈ రోజుకు అరెస్టు చేయలేదు. చీరాలలో జరిగితే 12 గంటలలోపు అరెస్టు చేయడం జరిగింది. వాహనం కూడా సీజ్‌ చేయడం జరిగింది.. అంటూ మండిపడ్డారు ఆమంచి కృష్ణమోహన్..


నాగార్జున రెడ్డిపై జరిగిన దాడిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ఈ కేసులో ఇప్పటికే కొంత మందిని అరెస్టు చేయడం కూడా జరిగిందన్నారు. నాగార్జున రెడ్డి అనే వ్యక్తి జర్నలిస్టు కాదు. 2019 ఎన్నికల్లో టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నాడు. ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు అత్యంత సన్నిహితుడిగా మారి టీడీపీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నాడు.. అంటున్నారు ఆమంచి కృష్ణమోహన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: