బోటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన వారికి జగన్ అందిస్తున్న కానుక ఎంతంటే?

venugopal Ramagiri
పాపికొండలు చూడాలనే ఆశ అవకాశాన్ని కల్పిస్తే,ఆ అవకాశం జాలి లేకుండా ఎందరో ప్రాణాలు తీసింది.ఆనందంగా తిరిగి వస్తామనే ఆశతో వెళ్ళిన వారి పాలిట యమ పాశమైంది.ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులవ్వుతున్న ఆ ప్రమాదాన్ని మరవలేక ఎందరో వేదన పడుతున్నారు.ఇక కచ్చులూరు వద్ద బోటు మునిగిన సంఘటనలో అక్కడి గిరిజనులు ఎంతో సహసం చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు.వారు ప్రదర్శించిన ధైర్యానికి చేసిన సహాయానికి వారికి ప్రభుత్వం ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.ఇక ఇప్పటికే ఈ ప్రమాద ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసామని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు తెలిపారు..ఈ బోటు ప్రమాదం దురదృష్టకరమైన సంఘటన అని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.



దేశంలో ఇంతవరకు ఇంత లోతులోఉన్న లాంచీని ఎప్పుడుచూడలేదని,ఒకవేళ ఎవరైనా తీస్తామని ముందుకువస్తే ప్రభుత్వం సహకారం తప్పక వారికి అందిస్తుందని చెప్పారు.ఇక ఈ సంఘటనజరిగిన వెంటనే కచ్చులూరి గ్రామస్తులు కొంతమంది ఒడ్డు నుంచి చూసి ప్రమాదంలో ఉన్న 26 మందిని కాపాడారని చెప్పారు.వారిని సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారని చెప్పారు.ఆ రోజు నేర్పుతో సాహసం చేసి ఎవరెవరు ప్రయాణికులను కాపాడారో వారికి నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఒక్కొక్కరికి రూ.25 వేలు ప్రోత్సహక నగదు ఇస్తున్నామన్నారు.వారి సహసం 26 మంది ప్రాణాలు కాపాడిందని,వారికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.



బోటు ప్రమాదంలో మరణించిన వారికోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అండగా వుంటూ సహాయ సహకారాలు అందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇక ఇప్పటికి ఆచూకీ లభ్యం కాని వ్యక్తులకు సంబంధించి డెత్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని బాధితుల బంధువులు కోరుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని చెప్పారు.ప్రమాదం జరిగిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘటనలోని బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడిందని ఈ సందర్భంగా గుర్తు చేసారు...



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: