హెల్మెట్ లేకుంటే 1000, లైసెన్స్ లేకుంటే 2500.. కట్టాల్సిందే
ఇటివల కేంద్రం కొత్తగా తెచ్చిన మోటారు వాహనాల చట్టంలో ట్రాఫిక్ నియమ నిబంధనలను కఠినతరం చేసింది. బారీ జరిమానాలతో తీసుకొచ్చిన ఆ చట్టంతో వాహనదారులు ఇక్కట్లను చూసి కొన్ని రాష్ట్రాలు ఆ జరిమానాలు తగ్గించాయి. కానీ రాష్ట్రాలకు ఆ అధికారం లేదని, కేవలం కొన్ని అంశాల్లో మాత్రమే తగ్గించుకునే వెసులుబాటు కల్పించింది. హెల్మెట్ ధరించకపోయినా, మైనర్లు వాహనాలు నడిపినా, రేసింగ్ లో పాల్గొన్నా తప్పనిసరిగా కేంద్రం విధించిన భారీ జరిమానాలు కట్టాల్సిందే. లైసెన్స్, బీమా లేకపోవడం, మద్యం తాగి డ్రైవింగ్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం.. వంటి అంశాల్లో మాత్రం జరిమానాలు తగ్గించుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది. వీటికి కూడా తనిఖీల్లో భాగంగా మాత్రమే తగ్గింపు ఉంటుంది.. కోర్టు కేసు విచారణకు వెళ్తే మాత్రం చట్ట ప్రకారం జరిమానాలు కట్టాల్సిందే.
మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177 నుంచి 198 వరకూ ఉన్న 31 సెక్షన్లలో చట్టంలో సవరణ తీసుకొచ్చారు. ఇందులో 20 సెక్షన్లకు యథావిధిగా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు. మిగిలిన 11 సెక్షన్లలో మాత్రమే రాష్ట్రాలకు వెసులుబాటు అధికారం కల్పించారు. వీటిపై ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారని రవాణా అధికారులు చెప్తున్నారు.
జరిమానాలు తగ్గించేందుకు వీలులేనివి..
సెక్షన్ |
ఉల్లంఘన |
పాత జరిమానా |
కొత్త జరిమానా
|
179 |
ఆదేశాలు పాటించకపోవడం |
500 |
2000 |
189 |
రేసింగ్ |
500 |
5000 |
193 |
లైసెన్స్ లేకపోవడం |
- |
25వేల నుంచి లక్ష వరకూ |
194 |
ఓవర్ లోడింగ్ |
2000 లేదా అదనపు టన్నుకు వెయ్యి చొప్పున |
20వేలు లేదా అదనపు టన్నుకు 2వేలు చొప్పున |
194ఎ |
ప్రయాణికుల ఓవర్ లోడింగ్ |
అదనపు ప్రయాణికుడికి 1000 చొప్పున |
|
194సి |
ద్విచక్ర వాహనాల్లో ఓవర్ లోడింగ్ |
100 |
2వేలు, మూడు నెలలపాటు లైసెన్స్ అనర్హత |
194డి |
హెల్మెట్ లేకపోవడం |
100 |
వెయ్యి, మూడు నెలలపాటు లైసెన్స్ అనర్హత |
194ఇ |
అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోవడం (కొత్తది) |
|
10 వేలు |
199 |
పిల్లల వాహనాలు నడిపితే (కొత్తది) |
|
యజమానికి రూ.25వేలు జరిమానా, 3ఏళ్ల జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ రద్దు |
జరిమానా తగ్గించేందుకు వీలున్నవి...
సెక్షన్ |
ఉల్లంఘన |
పాత జరిమానా |
కొత్త జరిమానా |
రవాణా శాఖ సవరణ |
177ఎ |
రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం |
100 |
500 |
250 |
180 |
అనధికారంగా వాహనాల వినియోగం |
1000 |
5000 |
2000 |
181 |
డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే.. |
500 |
5000 |
2500 |
182 |
డ్రైవింగ్ కు అనర్హత |
500 |
10,000 |
4,000 |
182బి |
ఓవర్ సైజ్ వాహనాలు |
- |
5,000 |
1,000 |
183 |
ఓవర్ స్పీడింగ్ |
400 |
1,000 – 2,000 |
750 |
184 |
ప్రమాదకర డ్రైవింగ్ |
1,000 |
5,000 |
2,500 |
185 |
మద్యం తాగి వాహనాలు నడపితే |
2,000 |
10,000 |
5,000 |
192ఎ |
పర్మిట్ లేని వాహనం |
5,000 |
10,000 |
6,500 |
194బి |
సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం |
100 |
1,000 |
500 |
196 |
బీమా లేకపోవడం |
1,000 |
2,000 |
1,250 |