తెలంగాణా ఆర్టీసీ సమ్మెపై వైసీపీ ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్

praveen

ఈ నెల 5న ఆర్టీసీ కార్మికులు మొదలు పెట్టిన  సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలుపెట్టి 5 రోజులైనప్పటికీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం దిశగా ఆలోచన  చేయలేదు. అంతేకాకుండా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను  తొలగిస్తాం  అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది ప్రభుత్వం . ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలంగాణ ఆర్టీసీ సమ్మె పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు లో జరిగిన వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశం లో పాల్గొన్న రోజా... తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

 

 

 

 

 ఏపీలో కార్మికులు అడగకముందే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆర్టీసీ కార్మికులు అంతా కృతజ్ఞతతో ఉండాలని రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు పట్టుపట్టి డిమాండ్ చేయక పోయినప్పటికీ... మాటతప్పని నాయకుడిగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని రోజా అన్నారు. కాగా  పక్క రాష్ట్రాల్లో పరిస్థితి అలా లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తే వారి ఉద్యోగాలని తీసేస్తామని ప్రభుత్వం చెబుతుందన్నారు. పరోక్షంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యాఖ్యానించిన రోజా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు.

 

 

 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ ఇంత పటిష్టంగా బలంగా ఉందంటే దానికి కారణం దివంగత సీఎం రాజశేఖరరెడ్డి,  ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు  తీసుకున్న నిర్ణయాలలే అని  రోజా అన్నారు. కాగా వైయస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ బలోపేతానికి  చేస్తున్న కృషి చేస్తున్న  కార్మిక సంఘం నాయకులను  కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: