బాబుకు షాక్ : పోలవరం అవినీతిపై విచారణకు హైకోర్టు ఓకే..!
నిప్పులా బతికాను.. ఇప్పటి వరకూ ఒక్క అవినీతి కేసు లేదు. అంటూ తరచూ చెప్పుకునే చంద్రబాబుకు ఇకపై అలాంటి అవకాశం దక్కకపోవచ్చు.. ఇప్పటి వరకూ అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకుని బయటపడిన చంద్రబాబుకు ఇప్పుడు కాలం కలసివస్తున్నట్టు లేదు. అసలే అధికారం కోల్పోయిన కాలంలో ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టేలా ఉన్నాయి.
తాజాగా పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను ఢిల్లీ హైకోర్టు బుధవారం నాడు ఆదేశించిందింది. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకొందని, ఈ విషయమై తన పిటిషన్‌ను ఫిర్యాదుగా భావించి విచారణకు ఆదేశాలు జారీ చేయాలని పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ పైనే ఢిల్లీ హైకోర్టు పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టులో అనేక అవకతవకలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.ఈ అవినీతికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడ ఆయన ఆ పిటిషన్‌లో ఆరోపించారు.
గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.5 వేల కోట్లకు పెంచిన విషయాన్ని పెంటపాటి పుల్లారావు తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను ఫిర్యాదుగా భావించి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల పట్ల సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు.
మరి ఈ విచారణ ఏ మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఫుల్లుగా బీజేపీని టార్గెట్ చేశారు. ఇప్పుడు విచారణ కేంద్రం చేతిలో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.