నరేంద్ర మోదీకి ఓటు వేయటం తప్ప భారతీయులకు వేరే దారి లేదంటున్న విశ్వ విజేత

అర్ధశాస్త్రంలో నోబుల్ ప్రైజ్ విజేత 'ఇండియా బార్న్ అమెరికన్  సిటిజెన్' అభిజిత్ బెనెర్జీ అసలు జన్మస్థలం కలకత్తా. భారతీయులకు నోబుల్ ప్రైజ్ విజేతగా కంటే ఆయన భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై విరుచుకుపడే 'సగం కమ్యూనిష్ట్ గా మిగతా సగం రాహుల్ గాంధికి అంటే కాంగ్రెస్' కు "న్యాయ్" పేరుతో గెలుపు పథకం నిర్మించి ఇచ్చిన వ్యక్తిగా బాగా పరిచయం, అలా ఖ్యాతి పొందారు.  ప్రపంచంలో పేదరికం అనే దాన్ని నిర్మూలనకు పరిశోధనలు జరిపిన అభిజిత్ బెనర్జీకి ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించిన విషయం జగమెరిగినదే.  అభిజిత్ బెనెర్జీ తో పాటు ఆయన భార్య ఎస్థర్ డ్యుఫ్లో - మైఖెల్ క్రేమర్ కూడా నోబెల్ కు ఎంపికయ్యారు. 

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారంతో భారత్ కీర్తిని రెపరెపలాడించిన అభిజిత్ బెనర్జీ తాజాగా మరో మారు కేంద్రప్రభుత్వంపై - ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దుమ్మెత్తి పోశారు. అభిజిత్ వామపక్షవాది అని - ఆయన ప్రతిపాదించిన ‘న్యాయ్' పథకం ఎన్నికల్లో తిరస్కరణకు గురైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ వార్తా సంస్థతో అభిజిత్ బెనెర్జీ స్పందిస్తూ, మాట్లాడుతూ గతి లేకే భారత ప్రజలు మోదీని ఎన్నుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ నిజంగా ప్రజాదరణ కలిగినవారేనని, ప్రతిపక్షంలో ఆయన్ని ఢీ కొని ఎదుర్కోగల సత్తా ఉన్న ఒక్క నాయకుడు కూడా లేరని  ప్రతిపక్షంలో సరైన నాయకుడు కనిపించకపోవడంతోనే ప్రజలు ఆయనకు ఓట్లేశారని విశ్లేషించారు. ‘మూకుమ్మడిగా’ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వానికి భారత ఓటర్లు ఆమోదం తెలిపారని - ఎన్నికల విజయాన్ని ప్రభుత్వ విధానాలకు ఆమోదం తెలిపినట్లుగా భావించకూడదని చెప్పారు. 

అయితే దీనికి ముందు 2019 పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించటం కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ప్రకటించిన న్యాయ్ పథకం అభిజిత్ బెనర్జీ మానస పుత్రిక అనే చెప్పాలి.  తాను సూచించిన ఆ పథకం ద్వారా - తనపై వస్తున్న విమర్శల మీద అభిజిత్ బెనర్జీ స్పందిస్తూ:

“మోదీకి ప్రజలు ఓట్లేశారు గాని, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కాదు. ఏ ప్రభుత్వమైనా వందలలో పనులు చేస్తుంది. వాటిన్నిటిపైనా ప్రజలు ఓట్లేయాలంటే సాధ్యం కాదు. వారు చాలా వరకు నరేంద్ర మోదీకి ఓటేశారు. ప్రతి పక్షంలో నరేంద్ర మోడీకి మించి సమర్ధత ఉన్న ఓట్లేయదగ్గ నాయకుడు లేడని ప్రజలు భావించారు.  నరేంద్ర మోదీకి నిజంగానే ప్రజాదరణ ఉందని నేను భావిస్తున్నా. అయితే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికీ ప్రజలు ఓట్లేశారని నేను అనుకోవడం లేదు. ఈ పథకానికి మోదీకి తను ఓటేయాలి, ఆ పథకానికి వేయకూడదు అన్న ఎంపిక ప్రజలకు లేదు. వారికి ఉన్నది ఒక్కటే చాయిస్ ప్రధానిగా మోదీనా.. కాదా?" అని అభిజిత్ బెనెర్జీ పేర్కొన్నారు.

బీజేపీ ప్రభుత్వం పట్ల తాను విమర్శలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై అభిజిత్ బెనెర్జీ స్పందిస్తూ "గతంలో నేను చేసిన వ్యాఖ్యలను వారు పరిశీలించాలి. యూపీఏ పాలన పైనా నేను తీవ్ర విమర్శలు చేశాను" అని పేర్కొన్నారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉందని అభిజిత్ బెనెర్జీ అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం. ప్రజాస్వామ్యానికి ఇది మేలు చేస్తుంది అయితే ఆ బాధ్యతను తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రజలు భావిస్తున్నట్లు నేను అనుకోవడం లేదు. ఆ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడు లేడు. అధ్యక్షుడు ఎవరైనా అతడికి బలమైన అధికారాలు ఇవ్వాలి. వారు కోరుకున్నట్లుగా పార్టీని నడిపించే స్వేచ్ఛనివ్వాలి’ అని సూచించారు. ఇలా కాంగ్రెస్ దమ్మున్న పార్టీ కాదని, సమర్ధవంతమైన నాయకత్వాన్ని సృష్టించ గలదని చివరకు ఆభిజిత్ బెనర్జీ కూడా అనుకోవటం లేదని మాత్రం అర్ధమౌతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: