విలువలే లేని ఈ రాజకీయ నేతని చూసి జాతి మొత్తం సిగ్గుపడాలి!

సంచలనం సృష్టించిన దివాకర్ ట్రావెల్స్ బస్ ప్రమాద సమయంలో జెసీ సోదరులు ప్రత్యేకించి అక్కడ  ధర్నా చేస్తూ జేసీ ప్రభాకర రెడ్ది  ఏపి సీఎం జగన్మోహనరెడ్దిని తిట్టిన తిట్లు అక్షరాల్లో రాయగలిగేది కాదు! జగన్ అధికారంలోకి వచ్చాక జగన్మోహన రెడ్డి ‘తమ వాడు’ అంటూ మెచ్చుకోలుగా మాట్లాడారు మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి. 
ఆలాగే జగన్మోహనరెడ్డి పాలన వంద రోజులు పూర్తి అయిన తరుణంలో దివాకర రెడ్డి చాలా అనుకూలంగా ప్రత్యేకించి పొగడ్తలతో స్పందించేశారు. 

జగన్మోహనరెడ్డి బాగా పాలిస్తున్నాడంటూకొన్ని  ప్రకటనలు ఏవో చేశారు. జగన్ దొరికిన సమయం ఇంకా తక్కువేనంటూ, ఇంతలోనే బాగా పాలిస్తున్నాడంటూ కితాబిచ్చారు దివాకరరెడ్డి. చరిత్ర వదిలేస్తే తాజాగా మీడియా ముందుకు వచ్చి జేసీ దివాకరరెడ్డి ఆశ్చర్యకరంగా మరో ప్రకటన చేశారు. అదేమిటంటే ఏపి సీఎం జగన్ కు పాలనానుభవం లేదట! ఇది మళ్లీ కనీసం బాణీ కూడా మార్చకుండా పాత పాటే అందుకున్నారు.  జగన్ కు పాలనానుభవం లేదని జనాలకు కూడా తెలుసు.

పాలనానుభవం లేకపోవటమే ఆయన గెలుపుకు ప్లస్ పాయింట్. నలభై యేళ్ళ అనుభవం ఉన్నవాళ్ళు ఐదేళ్ళలో రాష్ట్రానికి ప్రజలకు చేసింది శూన్యం. "రాష్ట్రం అప్పుల కుప్పే" అయింది. రాజధాని నిర్మాణం అంటూ ఇంత కాలం దేశాలు నగరాలుపట్టి తన బృందాలతో తిరుగుతూ ఖజానా శూన్యం చేసి చివరకు అయిదేళ్ల పాలనా కాలంలో ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించలేని ఆయన అనుభవం కాల్చనా?  అందుకే అనుభవం వద్దనుకొని జగన్మోహనరెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రి చేశారు. జాతి సంపదను దోచేసి చివరకు "రసం ఏమాత్రం లేని పిప్పి" ని జనాలకు మిగిల్చిన తెలుగుదేశం పార్టీని ఆ నాయకత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి, దేశంలోనే అత్యంత సీనియర్ ను అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుణ్ణి అప్పటివరకు ఆయన పక్షం వహించిన జేసీ కుటుంబీకులను కూడా నామరూపాల్లే కుండా ఓడించి జనాలు జగన్మోహన రెడ్డికి పట్టం కట్టారు. 

వెంటనే ప్లేటు పిరాయించి జగన్ ను ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నించి భంగపడ్డ జెసీ మళ్ళీ నాలుక మడతేసి ఇక ఇప్పుడు మళ్లీ జగన్ కు పాలనానుభవం లేదంటూ మాట్లాడటం ఆయనకే చెల్లింది. అయినా నెల కిందట జగన్ బాగా పరిపాలిస్తున్నాడని చెప్పిన, జేసీ ఇప్పుడు ఆయనకు పాలనానుభవం లేదంటూ మాట్లాడారు. దీని నేపధ్యం వేరే ఉందంటారు. మనకు కనిపిస్తూనే ఉంది. 

జగన్ అధికారంలోకి రాగానే ఆయనను ప్రసన్నం చేసుకుందామని దివాకరరెడ్డి పెద్దమనిషి- పత్తిత్తులా మాట్లాడారు. ఎలాగూ మొండిఘటం జగన్ ప్రసన్నం అయ్యేలాగా లేడని ఇప్పుడు ఇలా మడమ తిప్పి, నాలుక మడతేసి  మాట్లాడుతూ ఉన్నారు ఒక సిద్ధాంతం గాని శిగ్గుశరం గానీ లేని ఈ సీనియర్ రాజకీయ నేత! అని జనం ఆశ్చర్య పోతున్నారు.

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని గట్టిగా నమ్మిన వారిలో జేసీ ఉన్నారు. ఆఖరికి  తన కులజనుల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కూడా చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెట్టేలా పెట్రేగి పోయారు. నాడు జగన్ గెలవలేడని అంత నమ్మకం అన్నమాట. తన పని జరిగితే చాలు, జాతి ఏమైనా జనం ఏమైనా పర్వాలేదనేది ఆయన సిద్ధాంతం అని అర్ధమైంది.  తాను తన సంపద తన ట్రావెల్స్, తన కాంట్రాక్టులు సుభిక్షంగా ఉంటే చాలన్న మాటలు జనాలకు విసుగు  భరించలేనంతగా తెప్పించాయి. దీంతో ఆయన కుటుంబీకులందరినీ ఓడించారు.

తాడిపత్రి శాసన సభ్యుడుగా జేసీ ప్రభాకరరెడ్డి తనయుడు, అనంతపురం పార్లమెంట్ సభ్యుడుగా జేసీ దివాకరరెడ్డి తనయుడు ఓడిపోయారు. అలా వీరి దూకుడుకు జనం ఎన్నికల్లో “చెక్” పెట్టేశారు.  కుటుంబ రాజకీయ భవిత తల్లకిందులు చేసిన షాకింగ్ పలితాలొచ్చేసరికి జేసీ బ్రదర్స్ ముఖ్యంగా దివాకరరెడ్డి అవాక్కయ్యరు మారు మాట్లాడలేక పోయారు. ఆశలు ఆలోచనలు తల్లకిందులై బ్రతుకు జీవుడా! అనుకొంటూ జగన్ కు తెల్లజెండా చూపించే ప్రయత్నం చేశారు. అందుకే జగన్ వంద రోజుల పాలన పూర్తి అయినప్పుడు చాలా అనుకూలంగా  మాట్లాడారు. ఆయితే వీటిని పూచికపుల్లతో సమానంగా చూసిన జగన్ మామూలుగా ఉండిపోయారు. అయితే మరి కొన్ని పరిణామాలు జరిగాయి. అందులో:

*ఒకటి మైనింగ్ వ్యవహారాల్లో జేసీ సోదరులకు ప్రభుత్వం నుంచి నోటీసులు వెళ్లాయి. 

*ఇక జేసీ ట్రావెల్ దందాకు కూడా షాక్ తగిలింది. ఇరవై మూడు బస్సులను ఒకేసారి సీజ్ చేశారు అధికారులు. పర్మిట్లు లేకుండా ఇంతకాలం తెలుగుదేశం అవినీతి అక్రమాల స్వర్ణయుగం నుండి అంతరాయం లేకుండా నడుపుతున్న బస్సులకు అలా అడ్డుకట్ట పడింది. జేసీ ఆర్ధిక ఆయువు పట్టు - వ్యాపార సామ్రాజ్యం – మీద దెబ్బ పడింది. వీరి ఉన్నత ఆర్ధిక స్థితికి బస్సులు అత్యంత ప్రాణాధారం. 

ఇవి దివాకరరెడ్డికి “చికాకు” గా మారటం, ప్రజల్లో పలుకుబడి సన్నగిల్లటం, అవమానం జరిగాయి. ఇలాంటప్పుడు జగన్ ను నేలకేసి కొట్టారు తన మాటలతో దివాకరరెడ్డి. ‘జగన్ కు పాలనానుభవం లేదు.’ అని తేల్చేశారు.  ఒకవేళ వైసీపి - జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దివాకరరెడ్డి అక్రమ దందాలకు చెక్ పెట్టక పోయుంటే - జగన్ పాలన జేసీకి చాలా బాగా రుచించేది. ‘జగన్ మావాడు అంటూ..’ మరోసారి ఘనంగా ప్రకటించుకునే వారు జేసీ. జగన్ నుంచి అనుకూల స్పందన రాకపోవడంతో.. ఇప్పుడు జగన్ పాలన బాగోలేదని తేల్చారు.

తన విషయంలో ఎవరు ఎలా వ్యవహరిస్తారనే దాన్ని బట్టే దివాకరరెడ్డి మాటలు చేతలు ఉంటాయి. అంతకు మించి ఎలాంటి సిద్ధాంతాలు నీతి, నైతికత, కనీస రాజకీయ విలువల్లేని రాజకీయ నేతలు జేసీ కుటుంబం అని తాడిపత్రి ప్రజలకు కూడా బాగా తెలిసివచ్చింది. 

ఇక తమ పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే వాళ్లు కేసులకు భయపడే చేరుతున్నారని కూడా జేసీ అమాంతం ప్రకటించారు. అయితే ఆయనకు తెలిసినా ---అమాయకత్వం ప్రదర్శించే జేసీ మార్క్ కామెడీ ఇది.  నారా చంద్రబాబు నాయుడే తన అత్యంత సన్నిహితులైన సుజనా లాంటి వాళ్లను పైలెట్స్ గా బీజేపీలోకి పంపు తున్నారని, తరువాత తాను కూడా బిజేపికి సానుకూలంగా మారటానికో, లేక  బీజేపి గంగలో తెలుగుదేశం గంగను ను కలిపేస్తారని,  జేసీ కూడా అందులో ఉండి, కొద్ది రోజుల్లో బీజేపీ ప్రవాహంలో కలిసి పోతారనే ప్రచారమూ ఉంది.

ఈ తరుణంలో జేసీ మళ్లీ పార్టీ మార్పుల గురించి కూడా నీతులు చెబుతూ ఉన్నారు. అలా అయితే మైనింగ్ కేసులు, ట్రావెల్ కేసులు చుట్టుకుంటే జేసీ కూడా పార్టీ మారతారు కాబోలు, ఆయన మాటల ప్రకారమే! ఝనాలకు అర్ధం అవుతుంది. అవినీతి అక్రమం జేసీలకు కవల పిల్లలని చెప్పొచ్చంటున్నారు ఆయన ఆయన కుటుంబ రాజకీయాలు క్షుణ్ణంగా తెలిసిన తాడిపత్రి వాసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: