“మోదీ కూడా టివీ చూస్తున్నారు జాగ్రత్త!"

ఇండియన్-అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీకి ఈ నెల 14న నోబెల్ బహుమతి లభించింది. ఈ నోబెల్ బహుమతి గ్రహీత మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని ఆయన నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌ లో కలిసిన నేపథ్యంలో మీడియాను సరదాగా హెచ్చరించారు. 

నరేంద్రమోదీకి మీడియా గురించి బాగా తెలుసు, మోదీ టివీ చూస్తున్నారు జాగ్రత్త!  మీరు నన్నూ తనకు వ్యతిరేఖంగా ముగ్గులోకి దించుతున్నట్లు మోదీకి తెలుసు” - మీడియా తో అభిజిత్ బెనర్జీ ఆయన అన్నీ గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. తనతో మోదీ మాట్లాడినపుడు ప్రారంభంలోనే ఒక జోక్ వేశారని, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తనను ముగ్గులోకి దించేందుకు మీడియా ఎలా ప్రయత్నిస్తోందో? చెప్పారని తెలిపారు.


ఇండియన్-అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఎస్తేర్ డఫ్లో దంపతులకు మరియు అమెరికన్ ఆర్థికవేత్త మైఖేల్ క్రెమెర్‌ లకు సంయుక్తంగా ఆర్థిక శాస్త్రం లో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. పేదరిక నిర్మూలనపై వీరు చేసిన పరిశోధనలకు ఈ బహుమతి లభించింది.
అబిజిత్ భారత దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై చేసిన వ్యాఖ్యలపై అధికార బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ అభిజిత్ బెనర్జీ వామపక్షాలవైపు మొగ్గు చూపే ప్రొఫెసర్ అని ఆరోపించారు. అలాంటివారి అభిప్రాయాలను దేశ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. మరో బీజేపీ నేత రాహుల్ సిన్హా మాట్లాడుతూ రెండో భార్య విదేశీ వనిత అయినవారికి మాత్రమే నోబెల్ బహుమతులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అభిజిత్ సమావేశమయ్యారు. ఇరువురు ఈ సమావేశం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
 

అభిజిత్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఆయన (మోదీ) టీవీ చూస్తున్నారు; మిమ్మల్ని గమనిస్తున్నారు, మీరు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారో ఆయనకు తెలుసు’’ అని హెచ్చరించారు. ప్రధాన మంత్రి మోదీతో సమావేశమైనందుకు చాలా సంతోషంగా ఉందని అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పీఎం తనతో మాట్లాడటానికి చాలా సమయం కేటాయించారన్నారు. అపూర్వమైన భారత దేశం గురించి తన ఆలోచనా తీరును ఆయన వివరించారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశం గురించి ఆలోచిస్తున్న తీరు అద్వితీయమని అద్భుతమని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ మంగళవారం చెప్పారు.
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైనందుకు చాలా సంతోషంగా ఉందని అభిజిత్ పేర్కొన్నారు. విధానాల గురించి వినేవాళ్ళు ఉంటారని, కానీ వాటి వెనుక ఉన్న ఆలోచనల గురించి వినేవాళ్ళు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన ప్రధానంగా పరిపాలన గురించి మాట్లాడారని తెలిపారు. క్షేత్రస్థాయి ప్రజల్లో ఉండే అపనమ్మకం పరిపాలనపై ఎలా పడుతుందో వివరించారని తెలిపారు. పరిపాలన ప్రక్రియపై ఉన్నత వర్గాలు నియంత్రణ వ్యవస్థలను సృష్టిస్తుందని, బాధ్యతాయుత మైన ప్రభుత్వాన్ని కాదని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో తాను బ్యూరోక్రసీని ఏ విధంగా మార్చాలో అందులో మరింత బాధ్యతాయుతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నా నని మోదీ వివరించా రని తెలిపారు. అనంతరం మోదీ ఓ ట్వీట్‌లో బెనర్జీతో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. బెనర్జీ సాధించిన విజయాలపట్ల భారత దేశం గర్విస్తోందని పేర్కొన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: