అచ్చెన్నకు ఎంత కష్టమొచ్చింది ?

Vijaya

మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు కోర్టులో లొంగిపోయారు. చలో ఆత్మకూరు నేపధ్యంలో చంద్రబాబునాయుడు కరకట్ట నివాసం విషయంలో ఆమధ్య పోలీసులతో అచ్చెన్న కు పెద్ద గొడవ అయిన విషయం తెలిసిందే. రోడ్డు మీదే ఎస్పీని తన సిబ్బంది ముందే అచ్చెన్న నోటికొచ్చినట్లు తిట్టారు. దానిపై  పోలీసులు అచ్చెన్నాయుడు పై కేసు నమోదు చేశారు.

 

కేసు నమోదైన తర్వాత పోలీసులు అచ్చెన్నను అరెస్టుకు ప్రయత్నించారు.  అయితే అరెస్టు కాకుండా మాజీ మంత్రి తీవ్రంగానే ప్రయత్నాలు చేసుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. అందుకనే చివరగా హై కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.

 

అయితే హై కోర్టు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయలేదు. మంగళగిరి న్యాయస్ధానంలో లొంగిపోయి తర్వాత బెయిల్ తీసుకోవాలని అచ్చెన్నకు సూచించింది. దాంతో వేరే దారిలేక అచ్చెన్న ఈరోజు మంగళగిరి న్యాయస్ధానం ముందు లొంగిపోయారు. ఎలాగూ లొంగిపోయారు కాబట్టి కోర్టు రూ. 50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఇదే కేసులో పోలీసులకు అచ్చెన్నను అరెస్టు చేసే అవకాశం లేకుండాపోయింది.

 

అధికారంలో నుండి దిగిపోయిన తర్వాతే కాదు మంత్రిగా ఉన్నపుడు కూడా అచ్చెన్న, మరికొంత మంది నేతలు పోలీసులను నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. అప్పుడంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలా నోరుపారేసుకున్నా చెల్లిపోయింది. అధికారులను బహిరంగ జుట్టుపట్టి కొట్టిన ఎంఎల్ఏల మీద కేసు పెట్టి అరెస్టులు చేయటానికి పోలీసులకు ధైర్యం లేకపోయింది. అలాంటిది మంత్రుల జోలికి వెళితే ఇంకేమన్నా ఉందా ?

 

అయితే ఇక్కడే సమస్యలు తలెత్తింది టిడిపి వాళ్ళకు. అధికారంలో ఉన్నపుడు నోటికొచ్చింది మాట్లాడటం బాగా అలావాటైపోయింది కదా. అదే పద్దతిలో  ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా తమ అలవాటు మానుకోలేకపోతున్నారు. అందుకనే రోడ్డుమీద అచ్చెన్న ఎస్పీని పట్టుకుని యూస్ లెస్ ఫెలో అని ఇదని నోటికొచ్చినట్లు తిట్టేశారు. దాంతో మండిపోయిన పోలీసులు అచ్చెన్నపై కేసు పెడితే చివరకు కోర్టులో లొంగిపోవాల్సొచ్చింది మాజీ మంత్రికి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: