మరోసారి జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం కురిపించాడు. తాజాగా గుంటూరులో యనమల మీడియాతో మాట్లాడం జరిగింది. యనమల మీడియాతో రాజధాని అంశంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడం జరిగింది. గత ఐదు నెలల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ చేసింది ఏమి లేదు అని తెలిపారు. కనీసం లాయర్లకు కప్పు టీ కూడా దొరకడం లేదని హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం సిగ్గుపడాలని యనమల ఆరోపణలు చేశారు. ఇక జగన్ ఢిల్లీ పర్యటన విషయంపై కూడా యనమల తనదైన శైలిలో ఆరోపణలు చేశారు.
ఒక వైపు బీజేపీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీఎం జగన్ మధ్య చర్చలు జరగలేదు అని చెప్తుంటే మరో వైపు ముఖ్యమంత్రి పేరుతో ప్రభుత్వం ఎలా ప్రకటన ఇస్తుంది? అని నిలదీయడం జరిగింది. ఇవే కాకుండా ఒక సవాలు వేయడం కూడా జరిగింది. ఐదు నెలలగా జరుగుతున్న జగన్ పాలన, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చకుసిద్ధం అవుతారా మరి? అని యనమల సవాల్ చేయడం జరిగింది.
ఇక రాష్ట్రం దెబ్బ తినడానికి, అభివృద్ధి కుంటుపడటానికి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అర్థంపర్థం లేని విధానాలే కారణమని యనమల మండి పడ్డారు. గతంలో రాష్ట్ర విభజన నాటికి 2014-15లో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ మధ్య రెవెన్యూలోటు వ్యత్యాసం 8 శాతం ఉంటే.. దానిని తాము దిగిపోయే నాటికి ఒక శాతానికి తగ్గించడం జరిగింది అని తెలిపారు.
ఇక ఆదాయం లేదని స్వయంగా మంత్రులే అంగీకరించారని, ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రాన్ని నడపలేమని జగన్ సర్కారు చేతులెత్తేసిందని యనమల గుర్తు చేయడం జరిగింది. ఆర్థికాభివృద్ధి రేటును 11.02 శాతానికి చేర్చి.. తలసరి ఆదాయాన్ని రూ.93వేల నుంచి రూ.1,64,000కు పెంచితే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ అసమర్ధత వల్లే ఆర్థికాభివృద్ధి రేటు 8 శాతం తగ్గిపోయిందని యనమల విమర్శించడం జరిగింది.