ఆర్టీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా

Suma Kallamadi
టిడిపి సీనియర్‌ నేత, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా లేఖను రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. ఆయన పదవి నుంచి తప్పుకోవడంతో.. ఇప్పటివరకు  నడిచిన వివాదానికి పుల్‌స్టాప్ పడింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్‌ పోస్టులకు టీడీపీ నేతలు రాజీనామాలు చేయడం జరుగుతుంది.. కానీ వర్ల మాత్రం ప్రభుత్వం నుంచి నోటీసులు పంపిన తర్వాత తన పదవికి రాజీనామా చేయడం జరిగింది.


వాస్తవానికి ఆర్టీసీ చైర్మన్‌ పదవి కాలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. కాని ఆయన పదవి కాలం గడచి ఐదు నెలలు అవుతున్న రాజీనామా చేయలేదు. ఈ కారణంగా చేత ఏపిఎస్‌ ఆర్టీసీ ముఖ్య కార్యదర్శి, ఎండీ కృష్ణబాబు 1950 సెక్షన్‌-8లోని నిబంధన-2 ప్రకారం సెప్టెంబర్‌లోనే నెల రోజుల గడువిస్తూ నోటీసు జారీ చేయడం జరిగింది.

నోటీసు జారీ అవ్వడంతో వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్‌ పదవికి నోటీసులు అందిన నెల తరువాత రాజీనామా  చేయడం జరిగింది. ఆ నెల సమయం ముగియడంతో ఇప్పుడు తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చారు.


ఇక టీడీపీ హయాంలో వర్లను ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. వర్ల రామయ్య మాత్రం పదవి నుంచి తప్పుకోవడం జరగలేదు. అంతేకాదు ఛైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే.. ఆ గడువు కూడా ఏప్రిల్‌ 24తో ముగిసినా రాజీనామా చేయలేదు. దీంతో జగన్ సర్కార్ నెల క్రితం వర్ల రామయ్యకు నోటీసులు పంపించారు. వర్ల రామయ్య ఎందుకు గడువు పూర్తి ఐనా కూడా ఎందుకు రాజీనామా చేయలేదు, నోటీసులు వచ్చే వరుకు ఎందుకు వేచి ఉన్నారు అని పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: