కేంద్రంలో రెండోసారి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అధికారమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తమకు అంతగా లేని రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి పెట్టిన బిజెపి అక్కడ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు రకరకాల ప్రణాళికలతో చాపకింద నీరులా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే దక్షిణాది పై గురి పెట్టిన బిజెపి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడుపై సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చావుదెబ్బ తగలడంతో ఆ పార్టీని మరింతగా భూస్థాపితం చేసి ఆ ప్లేస్ లోకి వచ్చి చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు కీలక నేతలు సైతం బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ నెలలో టిడిపికి అదిరిపోయే షాక్ ఇచ్చేందుకు బిజెపి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నవంబర్ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు ఏపీ పర్యటనకు రాబోతున్నారని చెబుతున్నారు. ఈ పర్యటనలో ఊహించని నేతలు పార్టీలో చేరతారని చెబుతున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు సైతం ఇప్పటికే బిజెపి జాతీయ నాయకత్వంతో టచ్ లో ఉన్నారని... వారు సరైన టైం చూసుకుని టిడిపికి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
వీరితో పాటు టిడిపికి చెందిన మరికొందరు నేతలు సైతం బీజేపీ రాష్ట్ర నేతలు చర్చలు జరుపుతున్నారని.. వీరంతా కలిసి నవంబర్లో వారి సమక్షంలో పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ టీడీపీ మీద ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వైసిపి భారీ మెజార్టీతో అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లే ఆలోచన కూడా చేసే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చిన జగన్ నాలుగు నెలల్లోనే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ దూసుకుపోతున్నారు.
ఇక టిడిపితో పాటు జనసేన కు చెందిన కీలక నేతలు బీజేపీలోకి జంప్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమ ఓట్ల శాతం భారీగా పెంచుకునే ప్రణాళికలో ఉన్న, బీజేపీ నవంబర్ లో పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకొని అక్కడ నుంచి మరింత బలోపేతం అయ్యేఉ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి నవంబర్ ముహూర్తంలో టీడీపీకి షాక్ ఇచ్చే పెద్ద తలకాయలు ఎవరో ? చూడాలి.