హైదరాబాద్ లో బస్సు బీభత్సం... పరారైన తాత్కాలిక డ్రైవర్

praveen

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మొదలై 23 రోజుల గడుస్తుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అద్దె ప్రైవేటు బస్సులు నడుపుతూ ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తుంది ప్రభుత్వం. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడంతో బస్సులు నడిపేందుకు తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లను నియమించింది ప్రభుత్వం. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ తాత్కాలిక డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం చెబుతున్న ప్రైవేటు అద్దె బస్సులు ప్రయాణికుల అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేక పోతున్నాయి. 

 

 

 

 డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు . 2 వారాల క్రితం కూకట్ పల్లిలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును మరో బస్సు ఢీకొనడంతో ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. మద్యం మత్తులో డ్రైవర్ బస్సును  నడపాడని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్ కు దేహశుద్ధి చేసారు. ఇక తాజాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడిపి  ఢీకొట్టడంతో వ్యక్తి  అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈరోజు  హైదరాబాద్ లో బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో ఎదురుగా ఉన్న వాహనాలు పైకి దూసుకెల్లింది బస్సు. జేబీఎస్ నుంచి జనగాం వెళ్తుండగా హబ్సిగూడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనాలపై కి బస్సు దూసుకుపోవడంతో మూడు కార్లు  ధ్వంసమయ్యాయి. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే తాత్కాలిక డ్రైవర్లు బస్సు దిగి పరారయ్యాడు. 

 

 

 

 అయితే అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్లను విధుల్లోకి తీసుకుని బస్సులు  నడిపిస్తున్నారని...అందువల్లే  ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అంతేకాకుండా తాత్కాలిక డ్రైవర్లు బస్సు డిపోల నుంచి బస్సు బయటికి వచ్చాక నిర్ణీత మార్గాలలో ఎక్కడెక్కడ బస్సులను నిలపాలని దానిపై అయోమయం లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను తమ స్టేజీ వద్ద కాకుండా వేరే స్టేజీల వద్ద దింపుతున్నారు. అంతేకాకుండా ఇంకొంత మంది తాత్కాలిక డ్రైవర్లు మద్యం సేవించి ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ... ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిప్పుతున్న అద్దె  ప్రైవేటు బస్సుల్లో ఎక్కాలంటే ప్రజలు జంకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: