పావురాలకు దాన వేస్తె అది తప్పదు... ప్రజలకి జిహెచ్ఎంసి స్ట్రాంగ్ వార్నింగ్

praveen

పావురాలు... హైదరాబాద్ పేరు తీయగానే చరిత్ర కట్టడాలు ఎలా వస్తాయో ఈ పావురాలు కూడా అలాగే గుర్తొస్తాయి. హైదరాబాద్ చాలా చోట్ల వేల సంఖ్యలో  పావురాల కనిపిస్తుంటాయి .

 ఏ  చరిత్ర కట్టడం దగ్గర చూసిన పావురాలు వేల సంఖ్యలో కనిపిస్తుంటాయి. అయితే చాలామంది ప్రజలు  వీటికి రోజు దాన కూడా వేస్తుంటారు. అయితే  ఇన్ని రోజుల వరకు హైదరాబాద్ షాన్ గా  ఉన్నా ఈ పావురాలన్నీ ఇప్పుడు మాయమయ్యే స్థితికి ఏర్పడింది. ఎందుకంటే పావురాల కారణంగా ప్రజలకు ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయని తెలియడంతో జిహెచ్ఎంసి అధికారులు పావురాలను పట్టుకొని అడవుల్లో వదిలి వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ షాన్ గా  కనిపించే పావురాలు ఇంకొన్ని రోజుల్లో కనిపించకుండా పోనున్నాయి . 

 

 

 

 పావురాల కారణంగా అనేక ప్రాణాంతక వ్యాధులు రావడం తో పాటు చారిత్రాత్మక కట్టడాలు  కూడా పాడై పోతున్నాయి అని నిర్ధారణకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కారణంగానే నగరంలో పలు చోట్ల వేల సంఖ్యలో ఉన్న పావురలను పట్టుకుని అడవుల్లో వదిలేసే ప్రక్రియ జిహెచ్ఎంసి, ప్రభుత్వం  చేస్తోంది. దీనికోసం అటవీశాఖ అధికారులు కూడా సహాయం చేస్తున్నారు. ఇప్పటికే మొజంజాహి మార్కెట్ దగ్గర 50 పావురాలను పట్టుకుని శ్రీశైలం అడవుల్లో వదిలి వేసారూ  జిహెచ్ఎంసి అధికారులు. ఇంక మిగతా చోట్ల ఉన్న పావురాలని పట్టుకుని అడవుల్లో వదిలేసేందుకు   ప్రక్రియ మొదలు పెట్టారు. 

 

 

 

 చాలామంది పక్షి ప్రియులు పావురాలకు దానా వేస్తుంటారు. అయితే రోజురోజుకు పావురాలు సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు... పావురాలకు దానా వేయడం పైన నిషేధం విధించారు. పావురాలకు దానా వేస్తే ఫైన్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది జిహెచ్ఎంసి. మొజంజాహి మార్కెట్ లో పావురాల ఫీలింగ్ విక్రయిస్తున్నట్లు జొన్నలను  వెటర్నిటీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే జిహెచ్ఎంసి కి చెందిన అన్ని ఉద్యానవనాల్లో పావురాలకు ఫీడింగ్ ఇప్పటికే ప్రభుత్వం నిషేదించిన  విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రజలు కూడా పావురాలకు దానా వేయకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని వృద్ధి చెందుతుంది... పావురాలను పట్టుకుని అడవుల్లో వదిలేసినట్లు ప్రభుత్వం తెలుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: