వాట్సప్ లో సరికొత్త ఫీచర్..అదుర్సే
ఈ ప్రపంచంలో
ప్రతిదీ పోటియే. పోటీలో నిలవాలంటే అందరికన్నా ముందుండాల్సిందే. ఈ పరుగుల పోటికి
ఎప్పటికీ ముగింపన్నదే ఉండదు. ఇదంతా ఎందుకంటే వాట్సప్ లో సరికొత్త ఫీచర్
వచ్చేసింది. వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అందిస్తుంటేనే
వినియోగదారులను ఆకట్టుకునేందుకు వీలుంటుంది. స్మార్ట్ ఫోన్ లేని మనిషి ఉండడన్నది
ఎంత నిజమో వాట్సప్ సౌకర్యం లేని స్మార్ట్ ఫోన్ ఉండదు అన్నది కూడా అంతే
నిజం.
కొత్త ఫీచర్లను అందిస్తు వినియోగదారులను ఆకట్టుకోవటంలో ఎప్పుడూ ముందుంటే వాట్సప్ తాజాగా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే ఫింగర్ ప్రింట్ అన్ లాక్ సిస్టమ్. రోజురోజుకు యూజర్లను పెంచుకోవటంలో భాగంగా వాట్సప్ యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సౌకర్యాలను తీసుకొస్తోంది. నిజానికి ఈ ఫీచర్ కోసం యూజర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి.
ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ కు సుమారు 100 కోట్లమంది యూజర్లు ఉన్నారన్నది టెక్ ఇండస్ట్రీ అంచనా. మరి ఇన్ని కోట్లమంది యూజర్లు జారిపోకుండా అట్టే పెట్టుకోవటం ఒక ఎత్తైతే మరింతమందిని ఆకట్టుకోవటం మరో ఎత్తు. అందుకనే వాట్సప్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సౌకర్యాలను అందించటంలో పోటి పడుతుంటుంది.
తాజా సౌకర్యం ఫింగర్ ప్రింట్ సౌకర్యాన్ని వినియోగదారులకు అందించటం కోసం యాజమాన్యం మొదట బీటా సెట్టింగ్ ఏర్పాటు చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ యూజర్లు ఇప్పటి నుండి ఫింగర్ ప్రింట్ అనలాక్ సౌకర్యం వినియోగించుకోవచ్చని యాజమాన్యం ప్రకటించింటంతో యూజర్లు ఫుల్లు ఖుఫీగా ఉన్నారు.
మామూలుగా వాట్సప్ యూజర్ల ఫోన్ ఇంకెవరి చేతిలో అయినా పడితే వాట్సప్ చాటింగ్ లను వెతకటం మామూలే. అలాంటిది బయోమెట్రిక్ సిస్టమ్ గనుక ఏర్పాటు చేసుకుంటే యూజర్ తప్ప ఇంకెవరు కూడా ఫోన్లోని వాట్సప్ ను ఓపెన్ చేయలేరు. ఇప్పటికి ఈ సౌకర్యం వాట్సప్ లో ఉన్నా థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగించుకోవాల్సొస్తోంది. అందుకనే తానే సొంతంగా ఫింగర్ ప్రింట్ అన్లాక్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. కాబట్టి తమ ఫోన్లలోని వాట్సప్ చాట్ ను ఇతరులు చూస్తారన్న భయం యూజర్లకు అవసరం లేదన్నట్లే.