ఏపీలో కీలకమైన ఆ కులానికి.. వైఎస్ జగన్ చేసిందేంటి..?

Chakravarthi Kalyan

కాపులు ఏపీలో చాలా బలమైన కులం.. పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్న సామాజిక వర్గం. మరి అలాంటి కాపులకు రాజకీయంగా ఏ పార్టీ అండగా నిలిచింది. ప్రత్యేకించి వైఎస్సార్సీపీ కాపులకు ఏం చేసింది .. ఓ సారి పరిశీలిద్దాం..


కాపులను బీసీల్లో చేరుస్తానన్న అబద్ధపు హామీ ఇచ్చింది చంద్రబాబు అయితే బీసీ ఎఫ్ రిజర్వేషన్ గురించి ఇటీవల కాపు నేత ముద్రగడ జగన్ ను ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ అంశం తన పరిధిలోది కాదని, అది కేంద్రం చేతుల్లో ఉందని అధికారంలోకి రాకముందే స్పష్టం చేసారు వైయస్ జగన్. బదులుగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారిని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


అబద్ధపు హామీలు కాకుండా సూటిగా కాపుల పట్ల తన వైఖరిని స్పష్టం చేసిన వైయస్ జగన్ కు సన్మానం చేసి మరీ మద్దతు పలికారు ఆ సామాజిక వర్గ ప్రజలు. ఓట్లతో తమ నమ్మకాన్ని కూడా జగన్ పై ఉందని నిరూపించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి 1000 కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని ముద్రగడ హర్షించలేక పోయారు.


కాపు సామాజిక వర్గంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం, నలుగురికి మంత్రి పదవులు, ఇతర కీలక పదవులు ఇస్తూ రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారు.


ఇసుక, మద్యం రవాణా బాధ్యతల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చెవిన పడనట్టే నటిస్తున్నారు. గత ప్రభుత్వం 5000 కోట్లు కాపు కార్పొరేషన్ కు ఇస్తామని చెప్పి 1500 కోట్లు కూడా ఖర్చు చేయకపోయినా ముద్రగడ నోరు మెదపలేదు. ముఖ్యమంత్రి గారు తన పరిధి కాదని స్పష్టం చేసిన అదే రిజర్వేషన్ల అంశం పైనే పట్టుబట్టడంలో ముద్రగడ వ్యూహం ఏంటో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: