దేశ రాజధానిలో ముదురుతున్న పోలీసులు, లాయర్ల వివాదం... నిరసన బాట పట్టిన పోలీసులు

praveen

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులకు న్యాయవాదులకు మధ్య జరిగిన వివాదం తీవ్రతరమవుతుంది. శనివారం తీస్ హజారీ  కోర్టు ప్రాంగణం వద్ద పార్కింగ్  విషయంలో  న్యాయవాదులు పోలీసుల మధ్య జరిగిన వివాదం చిలికి చిలికి గాలి వానల తయారవుతుంది.  ఈ రెండు వర్గాల్లో ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు  దారితీస్తుంది. తమ పై కాల్పులు జరిపారు అంటూ ఆగ్రహించిన న్యాయవాదులు... ఈరోజు సాకేత్ కోర్టు సమీపంలో పోలీసులపై దాడి చేశారు. సాకేత్ కోర్టు వైపుగా వస్తున్న ఓ కానిస్టేబుల్ ను  ముట్టడించి పిడిగుద్దులు కురిపించారు న్యాయవాదులు. అంతేకాకుండా కొన్ని పోలీసు వాహనాలను సైతం నిప్పంటించి తగలబెట్టారు. అయితే  తమ వాహనాలకు నిప్పు పెట్టడంతో ఘర్షణ  తీవ్ర తీవ్రం కావడంతో తాము  గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు . కాగా  న్యాయవాదులు పోలీసుల మధ్య చోటుచేసుకున్న వివాదం కాస్త రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ వివాదం నాలుగో రోజుకు చేరుకుంది.నేడు న్యాయవాదులు వైఖరిని వ్యతిరేకిస్తూ పోలీసులు నిరసనకు దిగారు. 

 

 

 

 కాగా నేడు సాకేత్ కోర్టు వద్ద న్యాయవాదులు ఆగ్రహంతో పలు వాహనాలు నిప్పంటించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి . కాగా  నిరసన వ్యక్తం చేస్తున్న  న్యాయవాదులను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా పోలీసులపై దాడికి యత్నించారు న్యాయవాదులు. దీంతో తప్పని పరిస్థితుల్లో న్యాయవాదులపై లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా  రోజు రోజుకి  ఢిల్లీలో న్యాయవాదులు పోలీసుల మధ్య ఘర్షణ ముదురుతున్న నేపథ్యంలో...తాజాగా న్యాయవాదుల తీరును నిరసిస్తూ పోలీసులు నిరసన బాట పట్టారు. పోలీసులపై న్యాయవాదుల దాడులను నిరసిస్తూ ఢిల్లీ పోలీసులు అధికారులు హెడ్ క్వార్టర్స్ వద్ద తమకు న్యాయం చేయాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. 

 

 

 

 శనివారం తీజ్ హజారీ   కోర్టు వద్ద పార్కింగ్ విషయంలో జరిగిన ఘటనకు సంబంధించి వీడియో రికార్డింగ్ చూసి  తప్పు ఎవరిదో తేల్చాలి  అంటూ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు నిరసనకు ఐపీఎస్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. దేశంలోని పోలీసులు మద్దతు మీకు ఉంటుందని ఐపీఎస్ అసోసియేషన్ ఢిల్లీ పోలీసులకు హామీ ఇచ్చింది. అయితే ఆందోళన విరమించాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ కూడా పోలీసులు నిరసన తెలపటం ఆపటం లేదు . తప్పు చేసిన వారు ఎవరో గుర్తించే వరకు ఆందోళన ఆపేది లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: