ఫొటో తీశాడు.. వైరల్ అయ్యింది.. ఉద్యోగం కోల్పోయాడు..

Durga Writes
ఈ మధ్యకాలంలో ఎంతో మంది చిన్న చిన్న తప్పులు అనవసరంగా ఉద్యోగాలు పోగుట్టుకుంటున్న సంగతి తెలిసిందే. కొందరు విధుల్లో ఉంది టిక్ టాక్ చేసి సస్పెండ్ అవుతే మరికొందరు ఫోటోలు తీసి సస్పెండ్ అవుతున్నారు. ఇంకా విషయానికి వస్తే.. ఓ సాధారణ ప్రయాణికురాలిని ఎటువంటి అనుమతులు లేకుండా కాక్‌పిట్‌లో ఫొటో తీయడంతో ఉద్యోగం కోల్పొయాడు ఓ పైలట్‌. 

                                 

ఈ ఘటన చైనాలో జరిగింది. జనవరి 4న చైనాలోని గుయిలిన్‌ నుంచి యాంగ్జోకు ఎయిర్‌ గుయిలిన్‌ విమానంలో జీటీ 1011లో ఈ ఘటన జరిగింది. పైలెట్ కాకిపిట్ లో తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆదివారం విమానయాన సిబ్బంది దృష్టికి వచ్చి చేరింది. అనుమతి లేకుండా కాక్‌పిట్‌లోకి సాధారణ ప్రయాణికుల్ని అనుమతించడం అనేది నిబంధనలు ఉల్లంఘించడమేనని, ఈ ఫోటోని తీసిన పైలట్‌ను విధుల నుంచి బహిష్కరించినట్లు, దీనికి సహకరించిన సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

                     

అయితే ఇది అంత జరగటానికి ఆ యువతీ ఏ కారణం. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినా ఫోటోలో ఆ మహిళ ప్రయాణికురాలు తన చేతి వేళ్లను 'వి' ఆకారంలో చూపిస్తూ ఉంది. కాగా ఆ ఫోటో కింద కాప్షన్ పెడుతూ.. 'కెప్టెన్‌కు ధన్యవాదాలు , కాక్‌పిట్‌లో ఫొటో దిగడం చాలా సంతోషంగా ఉంది' అంటూ పేర్కొంది. దీంతో ఆ ఫోటో వైరల్ అయ్యి ఆ పైలెట్ ని ఉద్యోగం నుంచి తొలిగించేలా చేసింది. కాగా ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో జారుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: