స్పీకర్ కంటే ముందే ఎమ్మెల్యేనంటూ బాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీతారాం

Yadav B Sridhar

రాజ్యాంగ పదవుల్లో కొనసాగేవారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ, హుందాగా వ్యవహరిస్తుంటారు . కానీ దానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు . ఏపీ ప్రతిపక్ష నేత , టీడీపీ అధినేత చంద్రబాబు పై ఆయన ఒంటికాలితో లేస్తున్నారు . హాయ్ ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు , లోకేష్ ప్లాన్ చేశారన్న ఆయన , అగ్రిగోల్డ్ తో సంబంధం లేదని చంద్రబాబు ప్రకటించగలరా? అంటూ ప్రశ్నించారు . అంతటితో ఆగకుండా చంద్రబాబు బండారం బయటపెడతామని ,  ప్రజల ముందు నిలుచోబెట్టి గుడ్డలూడదీస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు . తనకెంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు , ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలంటూ  విరుచుకుపడ్డారు .


 ప్రభుత్వాలే కుంభకోణాలకు పాల్పడితే ప్రజలు ఏమైపోవాలని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు . తన కళ్ళ ముందు అన్యాయం జరిగితే స్పందించకూడదా ? అంటూ అయన ఎదురు ప్రశ్నించారు . తాను ముందు ఎమ్మెల్యేనని ఆ తరువాతే స్పీకర్ నని చెప్పుకొచ్చారు . అయితే గతం లో స్పీకర్లుగా వ్యవహరించిన వారు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ , రాజకీయ విమర్శలు చేసేవారు కాదు . కానీ తమ్మినేని మాత్రం దానికి తాను పూర్తి విరుద్ధమన్నట్లు వ్యవహరిస్తున్నారు . గతంలోనూ చంద్రబాబు పై విమర్శలు గుప్పించిన అయన , హాయ్ ల్యాండ్ భూములు, అగ్రిగోల్డ్ వ్యవహారం లో గత  టీడీపీ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు .


 స్పీకర్ పదవి తమ్మినేని కి  సుతారం నచ్చినట్లు లేదని, భవిష్యత్తులో  ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారేమోనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .  శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రస్తుతం ధర్మాన ప్రసాదరావు మంత్రిగా వ్యవహరిస్తుండగా, రెండున్నర ఏళ్ల తరువాత మంత్రి వర్గ మార్పు ఖాయమని ముఖ్యమంత్రి జగన్ ముందే చెప్పడంతో , ఇప్పటి నుంచే సీతారాం మంత్రిపదవి రేసులో తానున్నాని చెప్పేందుకే బాబుపై విరుచుకుపడుతున్నారేమోనని విశ్లేషిస్తున్నారు. . 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: