బాబోరు దీక్ష టీడీపీకే బోరు బోరు...!

VUYYURU SUBHASH
40 ఏండ్ల రాజ‌కీయం.. ఇందులో  ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌దేండ్ల‌కు పైగా అనుభ‌వం. ఇక‌ అధికారం అనుభ‌వించింది 14 ఏండ్ల అనుభవం. అలాంటి అనుభ‌వం ఉన్న నేత ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు. అలాంటి చంద్ర‌బాబు ఇప్పుడు చేస్తున్న ఉద్య‌మాలు, ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, మాట్లాడుతున్న తీరు, ఆయ‌న అధికారం కోసం పడుతున్న తాప‌త్ర‌యం చూస్తుంటే న‌వ్వురాక మాన‌దు. ఇక ఇప్పుడు చంద్రాలు చేయ‌బోతున్న దీక్ష చూస్తుంటే ఇంకా ప‌డిప‌డి న‌వ్వాల‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఇసుక కొర‌త తీవ్రంగా ఉన్నమాట వాస్త‌వ‌మే. ఇసుక కొర‌త‌తో ఏపీలోని భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ప‌డుతున్న మాట వాస్త‌వ‌మే.


అయితే ప్ర‌తి ఏటా వ‌ర్షాకాలంలో ఇసుక కొర‌త అనేది రావ‌డం కామ‌న్‌. ఇసుక కొర‌త ఉన్న‌ప్పుడు కొంత ప‌నులు మంద‌గించ‌డం కామ‌నే. అయితే భ‌వ‌న నిర్మాణం చేసుకునే య‌జ‌మాని ముందు జాగ్ర‌త్త‌గా ఇసుక కొర‌త రాకుండా జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. అయితే వ‌ర్షాకాలంలోనే ఏపీలో ఎన్నిక‌లు రావ‌డం, ప్ర‌భుత్వం మార‌డం, బాబోరు ప్ర‌భుత్వం బొల్తా ప‌డ‌టం, అధికారంలోకి జ‌గ‌న్ రావ‌డం జ‌రిగింది.  


జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఏపీలో వ‌ర్షాలు జోరుగా కురిసి ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. క‌నివిని ఎరుగ‌ని వ‌ర‌ద‌ల‌తో ఇసుక కొర‌త తీవ్రంగా ఏర్ప‌డింది. దీంతో పాటుగా  ఇసుక అక్ర‌మాల‌ను అరిక‌ట్టి ప్ర‌జ‌ల‌కు పాద‌ర్శ‌కంగా ఇసుకను అందించాల‌నే ల‌క్ష్యంతో కొత్త పాల‌సీని తీసుకొచ్చింది జ‌గ‌న్ స‌ర్కారు. పాల‌సీ తెచ్చిన జ‌గ‌న్ స‌ర్కారు ఇసుక తోడి డంప్ చేద్దామ‌నుకునే స‌మ‌యానికే వ‌ర‌ద‌లు రావ‌డంతో అది కుద‌ర‌లేదు. దీంతో ఇసుక కొర‌త ఏర్ప‌డిన విష‌యం లోక‌మంతా తెలిసిందే.


వ‌ర‌ద‌లు రావ‌డం, ఇసుక కొర‌త ఏర్ప‌డటం ఇది జ‌గ‌న్ చేసిన త‌ప్పిదంగా ఏపీలోని ప్ర‌తిప‌క్ష నేత బాబోరు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, {{RelevantDataTitle}}