టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత దుకాణం సర్దేస్తోందట ? అదేంటి ఆమె టీడీపీ నుంచి ఏమైనా బయటకు వెళుతున్నారా ? అని సందేహించకండి. అసలు మ్యాటర్ ఏంటంటే 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేటలో టీడీపీ తరపున పోటీ చేసి మొదటి సారి ఎమ్మెల్యే అయింది వంగలపూడి అనిత… గతంలో అధికార పార్టీలో ఉన్న అనిత ప్రతిపక్షంలో ఉన్న రోజాతో ఢీ అంటే ఢీ అని అటు అసెంబ్లీలోను ఇటు బయట తన దూకుడును ప్రదర్శించింది.
చంద్రబాబు కూడా ఆమెకు బాగా ప్రయార్టీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె చాలా వివాదాల్లో కూరుకుపోయారు. అటు పర్సనల్ లైఫ్ లోనే కాకుండా.. ఇటు ఆమెను గెలిపించిన పాయకరావుపేట నియోజకవర్గంలోనూ ఆమెకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చివరకు ఎన్నికలకు ముందు ఆమె పాదయాత్ర చేసినా బాబు కరుణించలేదు. అయితే ఆమె వాయిస్ నేపథ్యంలో ఆమె ఎలాగైనా అసెంబ్లీలో ఉండాలని ఆమె సీటు మార్చరు.
ఎంత ఫైర్ బ్రాండ్ అయినా అనిత ఈ సారి జగన్ సునామిలో కొట్టుకుపోయింది. 2019 ఎన్నికల్లో పాయకరావుపేట కాకుండ చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరూకు షిఫ్ట్ చేశారు.. ఇక్కడ ప్రాతినిథ్యం వహించిన జవహర్ ను కృష్ణా జిల్లాకు షిఫ్ట్ చేశారు. అయితే వీరిద్దరు ఓడిపోయారు. అనిత కొవ్వూరులో ఓడిపోయినా తాను మాత్రం ఇక్కడే ఉండానని ముందు చెప్పారు.
అయితే ఎన్నికల్లో ఓడిపోయినా ఓవరాల్ గా చూస్తే నియోజకర్గంలో పర్యటించింది ఒక్కసారి మాత్రమే. దీంతో ఆమె తనకు అనుకూలంగా ఉన్న పాయకరావుపేటకు మకాం వేసినట్లు తెలుస్తోంది. అసలు ఆమె కొవ్వూరు వైపే చూడడం లేదు. దీంతో ఇక్కడ ఆమె దుకాణం సర్దేసినట్టే కనిపిస్తోంది. అదే టైంలో ఆమె పాయకరావుపేట బాధ్యతలే ఇవ్వాలని కూడా బాబును అడిగినట్టు తెలుస్తోంది.