రాహుల్ కు సుప్రీం కోర్టు మందలింపు

NAGARJUNA NAKKA
రాహుల్ గాంధీని సుప్రీం కోర్టు మందలించింది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చౌకీదార్ చోర్‌ హై అంటూ వ్యాఖ్యలు చేయడం, దాన్ని సుప్రీం కోర్టుకు ఆపాదించడంపై ఫైరయ్యింది. సుప్రీం కోర్టు తీర్పు రాహుల్‌కు ఎదురు దెబ్బంటూ కౌంటర్‌ ఇస్తున్నారు బీజేపీ నేతలు. 


చౌకీదార్ చోర్‌ హై అంటూ న్యాయస్థానం చేయని వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ ఆపాదించారని, కోర్టు ధిక్కారం కిందకు వస్తాయంటూ బీజేపీ నేత meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మీనాక్షి పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. రాహుల్‌కు అక్షింతలు వేసింది. చేయని వ్యాఖ్యలను ఆపాదించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చౌకీ దార్‌ చోర్‌ వ్యాఖ్యలను తమకు ఆపాదించడం దురదృష్టకరమనీ.. భవిష్యత్‌లో జాగ్రత్తగా మాట్లాడాలని మందలించింది. ఈ కేసులో రాహుల్ గాంధీ పెట్టుకున్న క్షమాపణను అంగీకరించింది. 


2019 లోక్‌సభ ఎన్నికల ముందు రాఫెల్‌ వివాదం విషయంలో మోడీపై తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్. యుద్ధ విమానాల కొనుగోలులో వేల కోట్ల రుపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందని, చౌకీదార్ చోర్‌ అంటూ తాను చేసిన ఆరోపణలు నిజమయ్యాయని తెలిపారు. సుప్రీం కోర్టు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తప్పుబట్టడంపై బీజేపీ నేతలు స్పందించారు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ అంటూ ఫైరయ్యారు.


రాహుల్‌ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు విన్పించారు. రాహుల్ తన వ్యాఖ్యలకు చింతించినట్లు కోర్టుకు వివరించారు. పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు శిక్ష పడాల్సిందేనన్నారు. ఆయన పెట్టుకున్న క్షమాభిక్షను తిరస్కరించాలని, పబ్లిక్‌లో సారీ చెప్పేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం... పరువు నష్టం దావా కేసును తిరస్కరించింది. చూద్దాం.. రాహుల్ గాంధీ భవిష్యత్తులో ఎలా ఉంటారో.. !


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: