పవన్ కళ్యాణ్ పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. అందుకే వెళ్లారు..

Balachander
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఢిల్లీ వెళ్లారని, ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ తరపున రాయభారం నడిపేందుకు అంబటి ఢిల్లీ వెళ్లారని అంబటి పేర్కొన్నారు.  అంబటి వ్యాఖ్యలపై జనసేన రియాక్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. ప్రవం కళ్యాణ్ ప్రజల తరపున మాత్రమే పోరాటం చేస్తున్నారని, ఎవరికీ వత్తాసు పలకడం లేదని జనసేన పార్టీ వ్యాఖ్యానించింది.  


ఇక అంబటి రాంబాబు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.  ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని, వారి మతవిశ్వాసాలను బట్టి వ్యవహరిస్తుంటారని అన్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నోసార్లు తిరుమల వెళ్లిన విషయాన్నీఅంబటి గుర్తు చేశారు.  మత విశ్వాసాలకు విరుద్ధంగా జగన్ ఎప్పుడు ప్రవర్తించలేదని, అలా చేయడని అన్నారు.  ప్రతి విషయంలో కూడా జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.  


ఇక ఇసుక కొరత పేరుతో ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని పవన్, తెలుగుదేశం పార్టీ చూస్తోందని, కానీ, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజలు తప్పకుండా అన్ని తెలుసుకుంటారని అన్నారు.  ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అంబటి రాంబాబు పేర్కొన్నారు.  మరో వారం పదిరోజుల్లోనే రాష్ట్రంలో ఇసుక అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.  


ఇసుక కొరత ఇకపై ఉండబోదని అన్నారు.  అన్ని రంగాల్లో ప్రభుత్వం ముందు ఉందని, దేశంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు జగన్ కృషి చేస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పై తెలుగుదేశం, జనసేన పార్టీలు రాద్ధాంతంచేస్తున్నాయని, ప్రజలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాలని కోరుకుంటున్నారని అంబటి పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివిన విద్యార్థులకు అవకాశాలు వస్తున్నాయని, వారే విజయపధంలో దూసుకుపోతున్నారని, మార్పు కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంబటి తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: