ఇది రాజకీయ నాయకులను మించి పోయింది.. ఎందులోనో తెలుసా? 

Balachander

రాజకీయాల గురించి చెప్పాలి అంటే.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఎవరు ఏ జెండాతో ఎప్పుడు కనిపిస్తారో ఎవరికీ తెలియదు.  రాజకీయాలంటే ఇవే మరి.  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరు.  అందుకే ఉదయం నువ్వు అలాంటివాడివి.. ఇలాంటి వాడివి అని పొగిడిన వ్యక్తులు.. సాయంత్రానికి వేరే పార్టీలో చేరి పొగిడిన వ్యక్తులనే తిట్టొచ్చు.  పొగిడిన నోటితో తిట్ల వర్షం కురిపించవచ్చు.  
ఇలా రంగులు మార్చడాన్ని ఊసరవెల్లి అని అంటారు.  ఊసరవెల్లి పరిసరాలను బట్టి రంగులు మారుస్తుంది.  తన అవసరం బట్టి.. శత్రువులు ఎటాక్ చేసినపుడు.. లేదంటే వేరే చోటికి వెళ్ళినపుడు.. రంగులు మారడం సహజమే.  దాని శరీరంలో రంగులను మార్చే కణజాలం ఉంటుంది.  ఈ కణజాలం వలన రంగులు మారిపుతోంది. ఒక్కోసారి రెండు మూడు రంగులు కలిసి ఉంటాయి.  ఇలాంటి రంగులు కనిపించడం సహజం.  
ఇక ఇదిలా ఉంటె, ఊసరవెల్లిలా ఈ జీవి కూడా సముద్రంలో రంగులు మారుస్తుంది.  దీనిని చూసి శాస్త్రవేత్తలు షాక్ అవుతున్నారు.  అసలు ఏంటి అది.  ఎందుకు అలా రంగులు మారుస్తుంది అనే డౌట్ అందరికి రావడం సహజమే.  అసలు ఏంటి ఆ జీవి అనే డౌట్ కూడా అందరికి వచ్చింది.  అదేంటో ఇప్పుడు చూద్దాం.  ఎందుకు అది అలా రంగులు మారుస్తుంది అనే విషయం శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.  
సముద్రంలో ఎలాంటి జీవులు ఉంటాయి.. చాలా రకాలు ఉంటాయి.  వాటిల్లో ఒకరి ఆక్టోపస్.  ఆక్టోపస్ గురించి అందరికి తెలుసు.  వేగంగా సముద్రంలో ఈదుతుంది.  రకరకాలుగా ఈదుతూ ఉండే ఈ జీవుల్లో చాలా రకాలు ఉన్నాయి.  అందులో ఒకటి ఇది.  ఈ అక్టోపస్ ఊసరవెల్లిలా క్షణక్షణానికి రంగులు మార్చేస్తుంది.   సముద్రం అడుగు భాగంలో నెలకు తగలగానే ఒక రంగు,  నీటిలో ఇదే సమయంలో మరోలా కనిపిస్తోంది.  ఎందుకు అది అలా మారుతుందో తెలియడం లేదు.  శాస్త్రవేత్తలు ఈ విషయంపైనే ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: