సీఎం జగన్ అంచనాలు తారుమారు!

Suma Kallamadi

ఏపీ సీఎం జగన్ ఇచ్చిన హామీల అమలు కోసం వెనుకాడకుండా నిధులను కేటాయిస్తున్న సంగతి అందరికి తెలిసిన తెలిసిన విషయమే కదా. అయితే ఇప్పుడు ఏపీకి ఒక  కొత్త సమస్య వచ్చి పడింది అంటే నమ్మండి. ఖర్చులకు అనుగుణంగా రెవెన్యూ ఆదాయం లేకపోవడం ఏపీ అధికారులను బాగా కలవరపెడుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ రూ.2 లక్షల 27వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది.

ప్రస్తుతం  దానికి తగ్గట్టు వసూళ్లు లేవు. ఈ ఆర్ధిక సంవత్స‌రం బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే  21 వేల కోట్ల రూపాయలు  ఆదాయం  తగ్గుతుందని ఆర్ధిక శాఖ అంచనాలు వేయడం జరిగింది. గత ఏడాది కంటే సుమారు మూడు శాతం  రెవెన్యూ ఆదాయాలూ తగ్గుతున్నట్లుగా అర్థం అవుతుంది.  
 

 

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 1.78 లక్షల కోట్లు రెవెన్యూ ఆదాయం వస్తుందని అంచనా వేయగా  1.57 లక్షల కోట్లు మాత్రమే  సాధ్యమ‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నవంబర్ 14 వరకూ రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ ఆదాయం  98.458 కోట్లుగా ఉందని అధికారులు తెలియ చేస్తున్నారు. ఇప్పటికే పథకాల అమలు కోసం సీఎం జగన్ భారీగా హామీలు కూడా ఇవ్వడం జరిగింది.

 

 

వాటన్నింటిని అమలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే నమ్మండి. దీంతో ఏం చేయాలో తెలియక సీఎం జగన్, అధికారులు డైలమాలో పడ్డారని సమాచారం. మరోవైపు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు కూడా అందడం లేదు. త్వరలోనే సీఎం జగన్ రచ్చబండ ప్రారంభించనున్నారు. రచ్చబండ ప్రారంభిస్తే మరిన్ని నిధులు అవసరమయ్యే అవకాశం ఉంది. అందుకే నిధుల సమీకరణతో పాటు లోటు బడ్జెట్ ను ఎలా పూడ్చాలనే దాని పై సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: