ఎందుకు ‘మహా’ రాద్దాంతం......?

Reddy P Rajasekhar

మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - శివసేన కూటమి 288 స్థానాలకు 161 సీట్లను కైవసం చేసుకుంది. కానీ శివసేన ఐదేళ్ల అధికారాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరిసగం పంచుకోవటానికి బీజేపీ అంగీకరించలేదు. మహారాష్ట్ర గవర్నర్ విధించిన గడువులోగా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 
 
ఆ తరువాత మహారాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. కానీ మహారాష్ట్రలో రాత్రికి రాత్రే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటంతో రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తివేసింది. ఫడ్నవీస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. బీజేపీ అజిత్ పవార్ మద్దతుదారులతో ప్రభుత్వం ఏర్పాటైంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
ఈరోజు పిటిషన్లపై విచారణ జరిగింది. కేంద్రం తరపున సొలిసిటర్ తుషార్ మెహతా పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు విఫలమైన తరువాతే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారని అజిత్ పవార్ 54 మంది ఎమ్మెల్యేల లేఖను సమర్పించటంతో దేవేంద్ర ఫడ్నవీస్ 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ ను కోరగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించారని కోర్టుకు తెలిపారు. 
 
కోర్టు దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపి కోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవటం మహా సంక్షోభానికి కారణమైంది. శివసేన తీరుతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఎన్నికల ముందు మిత్రపక్షంగా బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన ఎన్నికల ఫలితాల తరువాత శివసేన సీఎం పీఠంపై పట్టుబట్టటంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తొలుత 24 గంటల్లోగా బల నిరూపణను నిరూపించుకోవాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు ఆ తరువాత తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్లు ప్రకటన చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: