11 ఏళ్ళ క్రితం ఈరోజు... దేశానికి ఓ చేదు జ్ఞాపకం.?

praveen

11 ఏళ్ల క్రితం ఇదే రోజు... ముంబై లు మారణహోమం. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడిన రోజు. వందల కుటుంబాల్లో  విషాదం నింపిన రోజు. భారతదేశం మరువని చేదు అనుభవం ఈరోజు. ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన సంఘటన పదకొండేళ్ల క్రితం ఈ రోజు. ఈ మారణహోమంలో  శత్రువులతో పోరాడి నేలకొరిగిన సైనికులకు నివాళులర్పించడమే  కాదు.. మరణించిన ఎంతో మంది సామాన్య ప్రజలకు కుటుంబాల్లో ఈ ఘోర సంఘటనను తలుచుకొని  బాధపడే రోజు. నవంబర్ 26న పాకిస్తాన్లోని కరాచీ నుంచి అరేబియా సముద్రం ద్వారా... లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన... అజ్మల్ కసబ్ అనే  ఉగ్రవాద మరో 9 మంది ఉగ్రవాదులు ముంబై నగరం లోకి చొరబడ్డారు . ముంబైలోని ఒబేరాయ్ హోటల్, తాజ్,  చత్రపతి టెర్మినస్ దగ్గర మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు. హోటళ్లలో  ఉన్న విదేశీయులను బందీలుగా చేసుకుని ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో వారిని రక్షించేందుకు హోటల్లోకి ప్రవేశించేందుకు సైనికులకు మూడు రోజుల సమయం పట్టింది. 

 

 

 

 ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన చాలా మంది సైనికులు ప్రాణాలు వదిలారు.ఈ మారణ హోమంలో  166 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి గాయాలయ్యాయి. దీంతో  ఒక్కసారిగా ముంబై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గజగజా వణికిపోయింది. ఈ మారణహోమం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ మారణహోమంలో ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్ కసబ్ ను  కోర్టు విచారణ తర్వాత 2014లో ఉరి తీశారు. కాగా ముంబైలో జరిగిన ఘటనకు సంబంధించి వ్యూహ రచన మొత్తం పాకిస్తాన్ లో జరిగింది దీనికి సంబంధించిన ఆధారాలను భారత్ నిరూపించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఈ ఘటనతో తమకేమీ సంబంధం లేదు అని చెబుతోంది.గత సంవత్సరం  ఈ మారణహిమానికి  పదేళ్లు పూర్తి కావడంతో... ఈ ఘటనకు సంబంధించి సూత్రధారులు  ఎవరో  తెలిపినవారికి ఐదు మిలియన్ డాలర్లు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా  ప్రకటించింది. 

 

 

 

ఘటనకు పాల్పడిన వారు ప్రేరేపించిన వారు సహాయం చేసిన వారి వివరాలు తెలపాలని  సూచించారు. దీనికి బహుమతిగా ఐదు మిలియన్ డాలర్లు అంటే మన దేశీ కరెన్సీలో 35 కోట్లు ఇస్తామని ప్రకటించింది . ఈ ఘటనపై దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శ్రద్ధాంజలి ఘటించారు. 2008లో ముంబై ఉగ్ర  దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను... ఈ సందర్భంగా దేశాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన సైనికులు అందరికీ నివాళులు అర్పిస్తున్నాను ... వారి త్యాగాలను దేశం ఎన్నటికి మరువదు  అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: